ప్రజా వైద్యుడు డా.బాలకృష్ణయ్య శతజయంతి ఉత్సవాలు
న్యూస్‌తెలుగు/ వనపర్తి : డా.బాలకృష్ణయ్య తన నిజాయితీ, నిబద్ధత,అంకితభావంతో కూడిన నిస్వార్థ సేవాతత్పరతతో, ప్రజాశ్రేయస్సు కై 50 ఏళ్లు ప్రజల కు ఉచిత వైద్య సేవలు అందించినందుకు గాను
ప్రజావైద్యుడిగా , 30 ఎళ్ళు ప్రజల పక్షాన నిలిచిన తిరుగులేని ప్రజా నాయకుడిగా వనపర్తి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా, డాక్టర్ గా , సర్పంచ్ గా, 20 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ గా , రెండు సార్లు ఎమ్మెల్యేగా, బిసి కార్పొరేషన్ చైర్మన్ గా, ఆర్టీసి గోల్కొండ డివిజన్ చైర్మన్ గా , శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా ఇలా ఎన్నో పదవుల్లో వారు చేసిన సేవలు ఒక ఎత్తైతే కోన్ని వేల మంది నిరుపేద నిరుద్యోగులకు ఆయా సంబంధిత శాఖల్లో ఉద్యోగాలు కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాలకృష్ణ.
ప్రజల మనిషి, ప్రజావైద్యుడు వనపర్తి
డాక్టర్ శ్రీ బాలకృష్ణయ్య గారి శతజయంతి ఉత్సవాలలో భాగంగా 15 నవంబర్ 2024 రోజున శ్రీమతీ అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్టు నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలు శ్రీమతీ అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్టు మరియు విశ్వ మానవత సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా స్థాయి యోగాథన్ ఇవేంట్.
వేదిక: వనపర్తి జూనియర్ కళాశాల ప్రాంగణం
తేది: 14 నవంబర్ 2024 సమయం: మధ్యాహ్నం 3గంటలకు
భగవాన్ శ్రీ శ్రీ శ్రీ సత్యసాయి సేవా ట్రస్టు సహకారంతో
శ్రీమతీ అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్టు మరియు గ్లేన్ఈగల్స హాస్పిటల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అల్లోపతి వైద్య శిబిరం మరియు విశ్వ మానవత సంస్థ ఆధ్వర్యంలో
ఏర్పాటు చేసిన ఉచిత ఆయుర్వేద వైద్య శిబిరాం ఉంటుంది.
వేదిక: శ్రీసత్యసాయి మందిరం, భావాజీ మఠం, శ్రీరామ టాకీస్ ఎదురుగా. వనపర్తి పట్టణం
తేది: 15 నవంబర్ 2024
సమయం: ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు ఉంటుందని నిర్వాహకులు శ్రమతి. ఎంగంపల్లి ఉదయశ్రీ
మానేజింగ్ ట్రస్టీ, శ్రీమతి. అంజనీ బాలకృష్ణ మేమోరియల్ ట్రస్టు తెలిపారు. శ్రీమతీ అంజనీ బాలకృష్ణ మెమోరియల్ ట్రస్టు మరియు గ్రామ భారతీ ఆధ్వర్యంలో మూలం సంత (గోఆధారిత ప్రకృతి వ్యవసాయోత్పత్తుల మరియు చేనేత, చేతివృత్తుల మేళ.
వేదిక: శ్రీసత్యసాయి మందిరం, భావాజీ మఠం, శ్రీరామ టాకీస్ ఎదురుగా . వనపర్తి పట్టణం తేది: 15 నవంబర్ 2024
సమయం: 11 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందని , అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. (Story : ప్రజా వైద్యుడు డా.బాలకృష్ణయ్య శతజయంతి ఉత్సవాలు)