14 నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు
న్యూస్ తెలుగు / వినుకొండ : ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ వారి ఆదేశాల మేరకు బుధవారం వినుకొండ శాఖ గ్రంథాలయం ఆధ్వర్యంలో ఈనెల 14 నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు వినుకొండ శాఖ గ్రంధాలయ ఇంచార్జ్ అధికారి భూక్య బద్రి నాయక్ తెలిపారు. అలాగే గ్రంధాలయ వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలను వినుకొండ మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్, వినుకొండ తాసిల్దార్ సురేష్, ఎంపీడీవో పుట్టా రెడ్డి చేతుల మీదుగా గోడ పత్రికలు ఆవిష్కరించడం జరిగింది. ఈ వారోత్సవాల్లో వారం రోజులు పాటు పిల్లలకు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. చిత్రలేఖనం, వ్యాసరచన స్టోరీ, అలాగే మహిళలకు ముగ్గుల పోటీలు, వివిధ కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుంది. కావున వినుకొండ పట్టణంలోని విద్యార్థిని, విద్యార్థులు అందరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. (Story : 14 నుండి 20 వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు)