ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు
రక్త పరీక్షలు నిర్వహణ : రోటరీ క్లబ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో (వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా) రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పాఠశాలలోని 163 మందికి రక్త పరీక్షలను నిర్వహించడం జరిగిందని అధ్యక్షులు జయ సింహ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ క్యాంపు దాతగా క్లబ్బు ఉపాధ్యక్షులుగా నరేందర్ రెడ్డి సహాయ సహకారాలను అందించడం జరిగిందని, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నుంచి కార్యదర్శి శివయ్య ,సత్య నిర్ధారణ, రోటరీ మెంబర్లు కొండయ్య సహాయ సహకారాలను అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం పట్ల వారు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ రక్త పరీక్షల యొక్క నిర్వహణ వల్ల విద్యార్థుల యొక్క రక్తం యొక్క గ్రూపు తెలుస్తుందని, తద్వారా ఎప్పుడైనా అవసరమైన సమయంలో రక్తము దానం చేయవచ్చును లేదా తీసుకునే అవకాశం కూడా ఉందని తెలిపారు. ఈ అనంతరం హెడ్మాస్టర్ శైలజ, హిందీ పండిట్ వేణుగోపాల్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు రోటరీ క్లబ్, ఇండియన్ రెడ్ క్రాస్ సంస్థ నిర్వహణ పట్ల వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ల్యాబ్ టెక్నీషియన్ హరీష్ బాబు, అసిస్టెంట్లు సాహితీ సోఫియా, పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, బోధ నేతల సిబ్బంది పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు రక్త పరీక్షలు నిర్వహణ : రోటరీ క్లబ్)