UA-35385725-1 UA-35385725-1

‘మట్కా’ పక్కా మాస్ కమర్షియల్ సినిమా

‘మట్కా’ పక్కా మాస్ కమర్షియల్ సినిమా

డైరెక్టర్ కరుణ కుమార్

న్యూస్‌తెలుగు/హైద‌రాబాద్ సినిమా : మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ట్రైలర్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జివి ప్రకాష్ కుమార్ కంపోజ్ చేసిన మట్కా ఆల్బమ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘మట్కా’ నవంబర్ 14న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కరుణ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.

మట్కా కథకి ఆద్యం ఎక్కడ పడింది ?
-మట్కా కథకి ఆద్యం ఒక ఫ్యామిలీ మ్యారేజ్ ఫంక్షన్ లో పడింది. మా అత్తగారిది వైజాగ్. ఓ మ్యారేజ్ ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు ఫ్యామిలీ అంతా కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకుంటున్నాం. మా వైఫ్ తరఫున బంధువుల్లో ఒక అతను పంటర్ గా పని చేశాడు. ఏజెంట్స్ లా అన్నమాట. అప్పుడు ఫస్ట్ టైం ఈ మట్కా గేమ్ గురించి విన్నాను. ఆ మాటల సందర్భంలో వైజాగ్ లో నైట్ క్లబ్బులు, క్యాబరీలు ఉండేవని తెలుసుకున్నాను. నేనెప్పుడూ వైజాగ్ వెళ్ళినా జగదాంబతో ఆగిపోయావడిని. వైజాగ్ వన్ టౌన్ గురించి, అక్కడ కల్చర్ తెలుసుకున్నప్పుడు చాలా ఆసక్తికరంగా అనిపించింది. అక్కడి నుంచి అసలు ఈ గేమ్ ఎవరిది అనేది పరిశోధించడం మొదలుపెట్టాను. ఒక కథకుడిగా దీన్ని ‘వాడిపోయిన పువ్వులు’ పేరుతో ఒక షార్ట్ స్టోరీ గా రాయాలనుకున్నాను. కానీ రాస్తున్నప్పుడు ఇది సినిమా మెటీరియల్ అని అర్థమైంది. అప్పుడు ఒక ట్రీట్మెంట్ వెర్షన్ రాసుకున్నాను. అది ఫస్ట్ డ్రాఫ్ట్. ఈరోజు చూస్తున్నది 12 డ్రాఫ్ట్.

ఇందులో మీ మార్క్ చెప్పడానికి స్కోప్ దొరికిందా?
-మన దగ్గర అద్భుతమైన కథలు, సాహిత్యం వుంది. మనం తీసినన్నీ గొప్ప సినిమాలు ఎవరూ తీయలేదు. ‘మాలపిల్ల’ అనే సినిమా అందరికంటే ముందు మనం తీశాం. గొప్ప సాహిత్యం, కథలు, కల్చర్ వున్న తెలుగు నేల మనది. తమిళం, మలయాళం కంటే సూపర్ రూటెడ్ కథలు మనదగ్గర వున్నాయి. ‘మట్కా’ నా స్టయిల్ అఫ్ స్టొరీ టెల్లింగ్ తో ఒక కథని అందరినీ అలరించేలా చెప్పేలానే వుంటుంది. మట్కా పక్కా కమర్షియల్ సినిమా. చాలా స్టయిలీష్ ఫిల్మ్ మేకింగ్ లో చేసిన సినిమా.

మట్కా కథని చాలా పెద్ద కాన్వాస్ లో చైల్డ్ వుడ్ నుంచి చెప్పడానికి కారణం ?
-ఇది ఒక మనిషి లైఫ్ జర్నీ. వాసు బర్మా నుంచి వైజాగ్ కి ఒక శరణార్థిగా వస్తాడు. వైజాగ్ లో ఉన్న పెద్ద పెద్ద పవర్ఫుల్ పర్సన్స్ అంతా బయట నుంచి వచ్చిన వాళ్లే. అప్పటి వైజాగ్ వెనుక ఉన్న క్రైమ్, గ్లామర్, కాస్మోపాలిటన్ కల్చర్ ఇవన్నీ కథలో భాగమే.

మట్కా గురించి ఇప్పుడు జనరేషన్స్ కి చాలామందికి తెలియదు కదా..అది తెలియజేసేలా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
-సినిమా చూడండి. 100% మీకు క్లియర్ గా అర్థం అయిపోతుంది. ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని ఆ సీన్లన్నీ తీయడం జరిగింది. మట్కా ఎలా వచ్చింది.. దాన్ని ఎలా కొనసాగించారు? ఇవన్నీ చాలా క్లియర్ గా మీకు అర్థం అవుతాయి. సెల్ ఫోన్ లేని రోజుల్లో దేశం మొత్తానికి ఒక నెంబర్ ని పంపించడం అనేది ఈ కథలో నాకు చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. నిజంగా అది ఎలా జరిగిందో ఇప్పటికి నాకు తెలియదు. ఒకవేళ నేనే రతన్ ఖత్రీ అయివుంటే ఏం చేసేవాడిని అని తనలా ఆలోచించి ఆ ఐడియాస్ తో ఈ స్క్రిప్ట్ ని చేశాను.

వాసు క్యారెక్టర్ లో వరుణ్ తేజ్ గారు ఎలాంటి పెర్ఫార్మెన్స్ ఇచ్చారు?
-ఇప్పుడే సినిమాని లాక్ చేసుకుని వచ్చాను. ఇది వరుణ్ తేజ్ గారి వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ పెర్ఫార్మెన్స్. 20 ఏళ్ల తర్వాత కూడా మట్కానే ప్రస్తావిస్తారు. వరుణ్ గారు చాలా కూల్ పర్శన్. చాలా డెడికేషన్ తో వర్క్ చేశారు.

మట్కా కోసం రతన్ ఖత్రి జీవితాన్ని ఎంతలా తీసుకున్నారు?
-ఇందులో రతన్ ఖత్రి గారి జీవితాన్ని తీసుకోలేదు. ఆయన కథని ఆల్రెడీ ఒక వెబ్ సిరీస్ గా తీరుస్తున్నారు. అది వెబ్ సిరిస్ గానే తీయాలి. సినిమాకి వర్కౌట్ అవ్వదు. ఇందులో ఒకటే సిమిలారిటీ ఏంటంటే.. రతన్ ఖత్రి పాకిస్తాన్ నుంచి ముంబై వచ్చారు. ఇందులో వాసు బర్మా నుంచి వైజాగ్ వస్తాడు. అంతే. వైజాగ్ లో బర్మా కాలనీ వుండేది. అందులో రకరకాల మనుషులు వుండేవారు.

ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? అనుకున్న బడ్జెట్ లోనే తీశారా?
-79 రోజులు షూటింగ్ చేశాం. ఇప్పటివరకు నేను అన్ని సినిమాల్ని అనుకున్న బడ్జెట్ లోనే పూర్తి చేశాను. ఈ సినిమాను కూడా అనుకున్న బడ్జెట్ లోనే కంప్లీట్ చేశాం.

మట్కా టెక్నికల్ గా ఎలా వుంటుంది ?
-ఈ సినిమా కోసం చాలా పక్కాగా ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసుకున్నా. ప్రతిదీ స్కెచ్ రెడీ చేసుకున్నాం. ఒక సీన్ పేపర్ మీద ఉన్నప్పుడే దానికి ఎలాంటి లైటింగ్ కావాలి, ఎలాంటి లెన్స్ వాడాలో డిసైడ్ చేసుకున్నాను.

-ప్రతి సెట్ ని మొదట మినియేచర్ చేశాం. దాన్ని యాజిటేజ్ గా రిక్రియేట్ చేశాం. 3600 పైచిలుకు ఇమేజెస్ ని ఈ సినిమా కోసం ప్రాసెస్ చేశాను. ప్రతిదీ చాలా డీటెయిల్ గా ఉంటుంది. ఈ సినిమా కోసం చాలా అద్భుతమైన సెట్స్ వేశారు ఆర్ట్ డైరెక్టర్. కిషోర్ కుమార్ గారి కెమెరా వర్క్ ఈ సినిమాలో చాలా ప్రత్యేకంగా ఉంటుంది. విజువల్స్ చాలా అద్భుతమనిపిస్తాయి.

-జీవి ప్రకాష్ కుమార్ నేను కథ చెప్పిన రెండు నిమిషాలకే కనెక్ట్ అయిపోయారు. కథ నెక్స్ట్ లెవెల్ లో ఉందని అని చెప్పారు. జీవి మ్యూజిక్ చేసిన ఈ దీపావళి సినిమాలు అమరన్,  లక్కీ భాస్కర్ మంచి విజయం సాధించాయి. మట్కా హ్యాట్రిక్ అవుతుంది. ఆ రెండు సినిమాలు కంటే పవర్ఫుల్  మ్యూజిక్ కి  స్కోప్ వున్న సినిమా ఇది. ఆ స్కోప్ ని మాక్సిమం వాడుకున్నాడు. అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.

ఇందులో విలన్స్ రోల్స్ గురించి ?
-ఇలాంటి సినిమాల్లో పరిస్థితులు, పాలిటిక్స్ విలన్ గా వుంటాయి. వాటిని క్యారీ చేసి  మైండ్ గేమ్ అదే విలన్స్ కావాలి. అందులో కన్నడ కిషోర్, జాన్ విజయ్ లది అలాంటి పాత్రలే. ఇందులో దాదాపు గ్రే క్యారెక్టర్స్ వుంటాయి.
-అజయ్ ఘోష్ గారిది వెరీ సర్ ప్రైజింగ్ అండ్ పాజిటివ్ క్యారెక్టర్.
-మీనాక్షి, నోరా, నవీన్ చంద్ర క్యారెక్టర్స్ కథలో చాలా కీలకంగా వుంటాయి.

మీరు చిరంజీవి గారికి అభిమాని కదా..  వరుణ్  తేజ్ లుక్స్ విషయంలో ఆయన రిఫరెన్స్ లు తీసుకున్నారా?
-చిరంజీవి గారి రిఫరెన్స్ లు లేకుండా ఎలా తీస్తాను(నవ్వుతూ).  చిరంజీవి గారి రిఫరెన్స్ వుంది.

వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ గురించి ?
-నేను వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ కి కథ చెప్పాను. SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌ లో నా గత సినిమా చేశాను కాబట్టి వాళ్లు నా వర్క్ ని ఇష్టపడి స్వచ్ఛందంగా వచ్చి జాయిన్ అయ్యారు. ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ చేశారు. ఒక మంచి ప్రోడక్ట్ ఇవ్వాలనే పాషన్ తో వర్క్ చేశారు.

మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ గురించి?
-మూడున్నాయి. అందులో ఏది ముందుగా సెట్స్ వెళుతుందో తర్వలోనే తెలుస్తుంది.

ఆల్ ది బెస్ట్
-థాంక్ యూ (Story : ‘మట్కా’ పక్కా మాస్ కమర్షియల్ సినిమా)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1