రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు అన్యాయం
ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ ధ్వజం
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో చేనేతకు తీవ్రమైన అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటస్వామి ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2లక్షల 94వేల కోట్ల రూపాయల రాష్ట్ర బడ్జెట్లో అనేక రంగాలకు గత బడ్జెట్ కంటే ఈ బడ్జెట్లో అదనంగా కేటాయింపులు చేసిన తెలుగుదేశం ప్రభుత్వం
వ్యవసాయం తరువాత మన దేశంలోనే చేనేత పరిశ్రమ రెండవది ఇప్పటికే అనేక సంక్షోభాలను ఎదుర్కొంటుందని తెలిపారు.ఇటువంటి సందర్భంలో చేనేతకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వవలసింది పోయి ఎక్కడ కూడా చేనేతకు ప్రాధాన్యత ఇవ్వలేదు అని, ఎన్నికల సమయంలో చేనేత పరిశ్రమను అన్ని విధాల ఆధుకుంటామని చెప్పిన కూటమి ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లో తీవ్ర అన్యాయం చేసిందని వారు మండిపడ్డారు.గతంలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం నేతన్ననేస్తం పథకానికి 198 కోట్లు తమ వార్షిక బడ్జెట్లో 200 కోట్లు కేటాయిస్తే ఆ ప్రభుత్వం పైన బడ్జెట్లో 200 కోట్లు చాలదు కనీసం 1000 కోట్లు కేటాయించాలని అనేక ఆందోళనలో అన్ని సంఘాలతో పాటు ఆనాడు తెలుగు నాడు చేనేత కార్మిక సంఘం కూడా ఆందోళన చేయడం జరిగిందని వారు గుర్తు చేశారు.మరి ఈనాడు అందరితోపాటు వారు కూడా కోరిన విధంగా నేడు ఎన్ డి ఏ కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించడంలో చిన్న చూపు చూడటం ఆశ్చర్యానికి గురి చేస్తోందని తెలిపారు.రాష్ట్రంలోని సహకార సంఘాలకు గత ఆరు సంవత్సరాల నుండి ఎన్నికలునిర్వహించకుండా, సహకార సంఘాలకు రావలసిన 98 వేల కోట్ల రూపాయలు చెల్లించకుండా, సహకార సంఘాలను నిర్వీర్యం చేసిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. (Story : రాష్ట్ర బడ్జెట్లో చేనేతకు అన్యాయం)