ఏఐఎస్ఎఫ్ వాల్ పోస్టర్లు విడుదల
న్యూస్‌తెలుగు/వినుకొండ : స్థానిక శివయ్య భవన్, సిపిఐ ఆఫీసులో అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల వాలు పోస్టులు, గోడ పత్రాల ఆవిష్కరణ జరిగింది. అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభలు ఈనెల 27 నుండి 30వ తారీకు వరకు విజయనగరంలో రాష్ట్ర మహాసభలు జరుగుతున్నాయని, వీటిని జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మంగళవారం శివయ్య భవన్ సిపిఐ ఆఫీస్ లో గోడ పత్రాలు విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దేటి అభిషేక్ మాట్లాడుతూ. సమరశీల విద్యార్థి ఉద్యమాల రథసారథి భారత దేశ విద్యార్థి లోకానికి స్ఫూర్తినిచ్చి చైతన్యాన్ని కలిగించి సంఘటిత శక్తిగా ముందుకు నడిపించే శోధక శక్తి అఖిల భారత విద్యార్థి సమైక్య ఏఐఎస్ఎఫ్ నాడు బ్రిటిష్ పరాయి పాలకుల బానిసత్వం నుండి మాతృభూమి విముక్తికై సాగిన విరోచిత స్వాతంత్ర ఉద్యమంలో పొత్తుల లోనే పిడికిలి బిగించి స్వాతంత్రం మా జన్మ హక్కు అని చాటింది. భారతదేశ విద్యార్థి లోకాన్ని ఏకం చేసి 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నో నగరంలోని బెనారస్ విశ్వవిద్యాలయం లో పుట్టి పెరిగి అశేష త్యాగాలు చేసిన ఘనమైన చరిత్ర కలిగి 88 సంవత్సరాల్లోకి అడుగుపెట్టిన ఏకైక విద్యార్థి సంఘం ఏఐఎస్ఎఫ్ నాటి నుండి నేటి వరకు విద్యారంగంలో వస్తున్న సమస్యల సాధనకై నిరంతరం పోరాడుతున్నది ఏఐఎస్ఎఫ్ అని రాష్ట్ర మహాసభలకు వినుకొండ నియోజకవర్గం నుండి విద్యార్థిని, విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పెద్దేటి అభిషేక్ కోరారు”. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బెజవాడ మహేష్, శ్రీరామ్ ఎనోష్,పల్లె దేవరాజ్, కిరణ్, సుభాని, మస్తాన్ వలీ,జిలాని, తదితరులు పాల్గొన్నారు. (Story : ఏఐఎస్ఎఫ్ వాల్ పోస్టర్లు విడుదల)