ఘనంగా జరిగిన గ్రామోత్సవం
పాండురంగ స్వామి ఆలయ కమిటీ నిర్వహణ
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని శ్రీ పాండురంగ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కార్తీక మాస శుద్ధ ఏకాదశిని పురస్కరించుకొని ఆలయంలో పాండురంగూనికి ప్రత్యేక పూజలను, అభిషేకాలను అర్చకులు నిర్వహించారు. పాండురంగ స్వామిని అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. విశేష అలంకరణ గావింపబడిన పాండురంగ స్వామిని ప్రత్యేక వాహనములో పట్టణ పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వందలాది మంది భక్తాదులు పాల్గొని విజయవంతం గావించారు.ఈ కార్యక్రమంలో ఆరోగ్యశాఖ మంత్రి ఎన్డీఏ కార్యాలయ ఇంచార్జ్ హరీష్ పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. హరీష్ కు ఆలయ కమిటీ వారు ఘనంగా ఆహ్వానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ తబ్జుల శ్రీనివాసులు, ఈవో నాగరత్నమ్మ తో పాటు ఆలయ సిబ్బంది, వందల సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన గ్రామోత్సవం)