జీవి ని వరించనున్న క్యాబినెట్ పదవి
న్యూస్‌తెలుగు/వినుకొండ: వినుకొండ సీనియర్ శాసన సభ్యులు పల్నాడు జిల్లా మాజీ అధ్యక్షులు జీవి ఆంజనేయులు కు నేడు క్యాబినెట్ హోదా.. చీప్ విప్ లేదా విప్ మరికొద్ది సేపట్లో ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు జరిగే తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశంలో చీప్ విప్ లను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, IT శాఖా మాత్యులు నారా లోకేష్ నుండి ఇప్పటికే జీవి ఆంజనేయులుకు చీప్ విప్ పదవిపై హామీ లభించింది. పల్నాడు అధ్యక్షులుగా కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి అధికార దౌర్జన్యాలను ఎదుర్కొని పార్టీని ముందుకు తీసుకువెళ్లి ఆర్ధిక భారాన్ని భరించిన జీవి ఆంజనేయులుకు కులసమికరణలో మంత్రి వర్గంలో స్థానం దక్కకపోవడంతో చీప్ విప్ ద్వారా జీవి ని సంతృప్తి పరచాలని అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అంతేకాక తెలుగుదేశానికి అండగా వున్న పల్నాడు జిల్లాలో ఒక్కరికికూడా స్థానం లేకపోవడంతో పార్టీకి విధేయుడు సీనియర్ నాయకుడు జీవి ఆంజనేయులుకు చీప్ విప్ పదవికి లైన్ క్లియర్ అయింది. వినుకొండ తెలుగుదేశం వర్గాలలో జీవి కి చీప్ విప్ పదవిపై ఉత్కంఠ నెలకొంది. (Story : జీవి ని వరించనున్న క్యాబినెట్ పదవి )