కూటమిప్రభుత్వంతోనే పేద ప్రజల అభివృద్ధి
న్యూస్ తెలుగు/ సాలూరు : పేద ప్రజల అభివృద్ధికి సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ శ్రీ శిశు సంక్షేమ మరియు గిరిజన శాఖ మాత్యులు గుమ్మడి సంధ్యారాణి అన్నారు. సోమవారం చరవాణిలో సందేశం ఇస్తూ సోమవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడారు.రూ.2.94 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టిందన్నారు. గత ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయానికి గండి పడిందని అన్నారు. రాష్ట్ర వనరుల మళ్లింపు,దుర్వినియోగం జరిగిందని అన్నారు. పాలనలో అన్ని రంగాల్లో విధ్వంసం జరిగిందని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పతనం అంచున ఉందన్నారు. 2019 తర్వాత పరిణామాలు రాష్ట్ర చరిత్రలో చీకటి రోజులుగా మిగిలిపోయని అన్నారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా చేశారన్నారు.. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసి కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్నారు.మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారన్నారు. గత ప్రభుత్వం రాష్ట్ర వనరులను దారి మళ్లించిందన్నారు.
లోపభూయిష్ట విధానాల వల్ల ఆదాయానికి గండి పడిందని అన్నారు పన్నులను దారి మళ్లించిందని అన్నారు..
పరిమితికి మించిన రుణాలను అధికవడ్డీకితీసుకుందన్నారు.కేంద్ర పథకాల నిధులను దారి మళ్లించిందన్నారు .ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు పెట్టిందన్నారు నీటి పారుదలరంగం పతనమైందన్నారు.. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం వివిధ శాఖలకు కేటాయించిన.
బడ్జెట్ వివరాలుపెట్టారు
ఉన్నత విద్య రూ.2,326 కోట్లు
ఆరోగ్య రంగం రూ.18,421 కోట్లు
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి రూ.16,739 కోట్లు
పట్టణాభివృద్ధి 11,490 కోట్లు
గృహ నిర్మాణం రూ.4,012 కోట్లు
జలవనరులు రూ.16,705 కోట్లు పరిశ్రమలు,వాణిజ్యం 3,127 కోట్లు ఇంధనరంగం రూ.8,207 కోట్లురోడ్లు, భవనాలు 9,554 కోట్లు యువజన, పర్యాటక, సాంస్కృతికశాఖ రూ.322 కోట్లు
పోలీసు శాఖ రూ.8,495 కోట్లు
పర్యావరణ అటవీశాఖ 687 కోట్లు ఎస్సీ సంక్షేమం 18,497 కోట్లుఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు బీసీ సంక్షేమం 39,007 కోట్లు మైనార్టీ సంక్షేమం 4,376 కోట్లు స్త్రీ శిశుసంక్షేమం 4,285 కోట్లు నైపుణ్యాభివృద్ధిశాఖ 1215 కోట్లురూ.43,402.33 కోట్లతో ఏపీ వ్యవసాయ బడ్జెట్..
వ్యవసాయశాఖకు 8,564 కోట్లు
అన్నదాత సుఖీభవ 4,500 కోట్లు
ఉద్యానశాఖకు రూ.3,469 కోట్లు
వడ్డీలేని రుణాలకు రూ628కోట్లు
పంటల బీమాకు రూ.1,023 కోట్లు
వ్యవసాయ మార్కెటింగ్ రూ.314.80 కోట్లు సహకార శాఖకు రూ.308.26 కోట్లు
పొలం పిలుస్తోంది కార్యక్రమానికి రూ.11.31 కోట్లు ఉపాధి హామీ అనుసంధానానికి రూ.5,150 కోట్లుసూపర్ సిక్స్ పధకాలను అమలుచేస్తూ, అభివృద్ధి సంక్షేమానికి పెద్దపీట వేసిన ఏకైక ప్రభుత్వం.. మన చంద్రన్న ప్రభుత్వం అన్నారు. (Story :కూటమిప్రభుత్వంతోనే పేద ప్రజల అభివృద్ధి)