గుడిలో చోరీకి పాల్పడి వెనుతిరిగిన దొంగలు
న్యూస్ /తెలుగు ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని రేగాటిపల్లి రోడ్డు లో వెలసిన కాలభైరవ దేవాలయంలో శనివారం రాత్రి దొంగలు హుండీని ధ్వంసం చేసి నగదును ఎత్తుకెళ్లడానికి ప్రయత్నం చేయగా, చివరకు హుండీ ఎంతకీ తెరుచుకోకపోవడంతో దొంగలు పరారయ్యారు. స్థానికులు గమనించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ధర్మవరంలో దొంగతనాలు అధికం కావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు నిర్వహించే నైట్ బీట్ ను పగడ్బందీ చేయాలని ప్రజలు కోరుతున్నారు.(Story:గుడిలో చోరీకి పాల్పడి వెనుతిరిగిన దొంగలు)