Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి

న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జిల్లా కలెక్టర్ చేతన్, ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు మండలములోని వివిధ పంచాయతీలలో గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు తాసిల్దార్ (ఎఫ్ ఎ సి) సురేష్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 12వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రజా సమస్యల పరిష్కారిక వేదిక లో భాగంగా ఈ గ్రామ సభలను నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఆయా గ్రామసభలలో సంబంధిత అధికారులు ఉంటారని, ప్రజలు తమ యొక్క సమస్యలను ఏవైనా సరే తెలుపుకునే అవకాశం తో పాటు దరఖాస్తును ఇస్తూ తమ ద్వారా రసీదును కూడా పొందవచ్చునని, అనంతరం ఆన్లైన్లో నమోదు చేసి, విచారణ తర్వాత షెడ్యూల్ తేదీ ప్రకారం పరిష్కరించబడునని తెలిపారు. ఇప్పటికే గ్రామాలలో గ్రామ సభల యొక్క వివరాలను సంబంధిత సచివాలయం, వీఆర్వోల ద్వారా తెలియపరచడం జరిగిందని తెలిపారు. ఈనెల 12న దర్శనమల, 13న నేలకోట, 14న మల్లా కాలువ, 15న ఏలుకుంట్ల, బుడ్డారెడ్డిపల్లి, 19న రావుల చెరువు, 20న తుమ్మల, సుబ్బారావు పేట, 21న పోతుల నాగేపల్లి, 22న గోట్లూరు, 26న చిగీచెర్ల, 27న రేగాటిపల్లి ,28న కునుతురు, 29న ధర్మవరంలో ఉంటుందని తెలిపారు.(Story:గ్రామాలలో నిర్వహించే గ్రామ సభలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics