Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పోలీసు దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం 

పోలీసు దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం 

0

పోలీసు దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం 

ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు 

న్యూస్ తెలుగు/విజయనగరం :  పోలీసు యంత్రాంగం చంద్ర‌బాబు, లోకేష్ గుప్పిట్లోకి వెళ్లి మాన‌వ హ‌క్కుల‌ను హ‌రిస్తోంద‌ని, పోలీసు దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం చేస్తుంద‌ని ఉమ్మడి విజయనగరం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) అన్నారు. శ‌నివారం జిల్లా పరిధిలో పార్టీ నేత‌ల‌లు, సోషల్ మీడియా కార్యకర్తలుతో క‌లిసి స్థానిక డి.ఎస్.పి కార్యాలయంలో విజయనగరం టౌన్ డిఎస్పి ఎం శ్రీనివాసరావుకు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని టీడీపీ కూటమి అసమర్థ పాలనను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తే వేధిస్తున్నారని మండిపడ్డారు. సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టారని పలు చోట్ల కేసులు పెట్టారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలను ఉగ్రవాదులును హింసించినట్టు హింసించారని ఒక మహిళను ఐదు రోజులు చిత్ర హింసలు పెట్టడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల ఎస్పీతో పాటు డీజీపీకి ఫిర్యాదు చేస్తున్నామన్నారు.పోలీస్‌ అధికారులు చట్టబద్ధంగా వ్యవహరించాలని.పోలీసు యంత్రాంగం మానవ హక్కులను హరిస్తున్నారన్నారు. పోలీసు దౌర్జన్యాలపై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయపోరాటం చేస్తుంద‌ని అన్నారు.(Story:పోలీసు దౌర్జ‌న్యాల‌పై వైయ‌స్ఆర్‌సీపీ న్యాయ‌పోరాటం )

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version