నాలుగు రోజుల్లో దొంగతనం కేసును చేదించిన రూరల్ పోలీసులు
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఈనెల 5వ తేదీన ధర్మవరం మండలం గొట్లూరు గ్రామం ఎస్సీ కాలనీలో నివాసముంటున్న సాకే ఓబులమ్మ ఇంట్లో బీగాన్ని పగలగొట్టి ఒక బంగారు నెక్లెస్, బంగారు గణేష్ డాలర్, బంగారు చైను, నాలుగు జతల కమ్మలు, అందులో రెండు జతల రాళ్ల కమ్మలు, రెండు జతల సాదా కమ్మలు, మూడు జతల బంగారు మాటీలు, మూడు రాళ్ల బంగారు ఉంగరాలు, ఒక చిన్న బంగారు ఉంగరం కలిపి 6.5 తులాల బంగారం నగలను దొంగలు దోచుకుని వెళ్లారు. ఈ కేసును చాలెంజ్గా తీసుకున్న రూరల్ పోలీసులు నాలుగు రోజుల్లోనే చేదించడం జరిగింది. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం ఫిర్యాది తన పెద్ద కూతురు పుష్పాంజలి కి ధర్మవరం టౌన్ ఇందిరమ్మ కాలనీకి చెందిన చందమామ రవికిచ్చి వివాహం జరిపించడం జరిగిందని, పెళ్లయిన మూడు సంవత్సరాలు ఇద్దరు సంసారం చక్కగా కొనసాగిందని, అనంతరం ఇద్దరి మధ్య గొడవల కారణంగా విడిపోవడం జరిగిందన్నారు. అప్పటినుండి ఫిర్యాదు కూతురు పుట్టింట్లో ఉంటున్నదని ఫిర్యాదు అల్లుడు రవి చెడు వ్యసనాలు అలవాటు పడి, గత కొన్ని రోజుల క్రితం నుండి దొంగతనాలు చేద్దామని నిర్ణయించుకుని ఈనెల 5వ తేదీ రవి తన కూతురికి ఆరోగ్యం బాగాలేదని తెలిసి, చూడడానికి గొట్లూరు గ్రామానికి వచ్చాడు అని, ఫిర్యాది ఇంట్లోని వారు ఎవరు పనులమ్మితం వారు వెళ్లిపోగా ఫిర్యాదు ఒక్కటే ఇంట్లో ఉండి తను కూడా పనిమీద ఇంటి వాకిలికి బీగం వేసి వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఇదే అదునుగా చేసుకొని మెల్లగా రవి ఇంటిబిగాన్ని పగలగొట్టి బీరువాలో ఉన్న పై తెలిపిన బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగిందని, అటు తర్వాత పారిపోవడం జరిగిందని తెలిపారు. ఈనెల 8వ తేదీ సాయంత్రం నాలుగున్నర గంటలకు నాగలూరు గ్రామంలోని బస్టాప్ వద్ద ముద్దాయిని అరెస్టు చేసి, అతని వద్ద గల సొమ్మును స్వాధీనం చేసుకొని కోర్టుకు పంపడం జరిగిందని తెలిపారు. ముద్దాయి చందమామ రవి పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్నాడని తెలిపారు. ఈ కేసు విషయంలో ఎస్పి రత్న ఆదేశాల మేరకు డిఎస్పీ శ్రీనివాసులు సిఐ ప్రభాకర్ ను, ఎస్ఐ శ్రీనివాసులు ను, సిబ్బందిని అభినందించారు. ఈ దొంగతనం కేసులు నాలుగు రోజుల్లో చేదించడం పట్ల రూరల్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.(Story:నాలుగు రోజుల్లో దొంగతనం కేసును చేదించిన రూరల్ పోలీసులు)