శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానంలో స్వాములకు సద్ది వితరణ
న్యూస్ తెలుగు /వినుకొండ : వినుకొండ హనుమాన్ నగర్ లో వేంచేసిన శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానంలో శనివారం సద్ది విత్తరణ కార్యక్రమం నిర్వహించారు. గత రెండేళ్లుగా ఈ ఆలయంలో వివిధ మాలలు ధరించిన స్వాములకు సద్ది వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు పేర్కొన్నారు. ఈ సంవత్సరం మాలలు ధరించిన స్వాములకు సద్ది వితరణ చేసిన కనపర్తి వీర. వెంకటరావు, ఎండ్లూరి. సత్యనారాయణ, లేళ్ల. అంజిరెడ్డి, తలర్లపల్లి. కావూరి. నాగేశ్వరరావు ,(గోల్డ్ )ఏర్పాటూ చేసినందుకు కమిటీ సభ్యులు ప్రత్యేకంగా అభినందించారు. సద్ది వితరణ కార్యక్రమానికి వినుకొండ అర్బన్ సీఐ శోభన్ బాబు ముఖ్యఅతిథిగా హాజరై మాలలు ధరించిన స్వాములకు సద్ది వితరణ ఏర్పాటల్లో పాల్గొని కృష్ణుని దేవాలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సర్ది కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శోభన్ బాబు మాట్లాడుతూ ఆలయ కమిటీ మరియు భక్తులు ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు. (Story : శ్రీ సంతాన వేణుగోపాలస్వామి దేవస్థానంలో స్వాములకు సద్ది వితరణ )