Google search engine
Homeసినిమాఓటీటీ'రైటర్స్ టాలెంట్ హంట్' అనౌన్స్ చేసిన  ఆహా ఓటీటీ

‘రైటర్స్ టాలెంట్ హంట్’ అనౌన్స్ చేసిన  ఆహా ఓటీటీ

‘రైటర్స్ టాలెంట్ హంట్’ అనౌన్స్ చేసిన  ఆహా ఓటీటీ

న్యూస్ తెలుగు / హైద‌రాబాద్ సినిమా :
ప్రతిభావంతులైన రచయితలను ప్రోత్సహించేందుకు టాలెంట్ హంట్ ను సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ కంపెనీస్ ప్రొడ్యూసర్ ఎస్ కేఎన్ మాస్ మూవీ మేకర్స్, డైరెక్టర్ సాయి రాజేశ్ అమృత ప్రొడక్షన్స్ సహకారంతో ప్రకటించింది ఆహా ఓటీటీ. ఈ టాలెంట్ హంట్ ద్వారా ప్రతిభ గల రచయితలను వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ టాలెంట్ హంట్ వివరాలను తెలిపే కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఆహా ఓటీటీ కంటెంట్ హెడ్ వాసుదేవ్ కొప్పినేని మాట్లాడుతూ – అల్లు అరవింద్ గారు ఎప్పుడూ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తుంటారు. ఇప్పటికే పలువురు ఆయన ప్రోత్సాహంతో ఇండస్ట్రీకి పరిచయమై మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అరవింద్ గారి బాటలోనే ఆహా పయణిస్తోంది. ఆహా ద్వారా యంగ్ టాలెంట్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. ఇది మరింతగా కొనసాగించేందుకే మాస్ మూవీ మేకర్స్ ఎస్ కేఎన్, అమృత ప్రొడక్షన్స్ సాయి రాజేశ్ గారితో మేము రైటర్ టాలెంట్ హంట్ నిర్వహిస్తున్నా. వారి స్క్రిప్ట్ ను బట్టి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు అందించే ప్రయత్నం చేస్తాం. అన్నారు.

నిర్మాత ఎస్ కేఎన్ మాట్లాడుతూ – మిగతా భాషల్లో వచ్చిన వైవిధ్యమైన కథలు మన తెలుగులో ఎందుకు రావడం లేదనేది మాకు తరుచూ ఎదురయ్యే ప్రశ్న. తమకు తగినంత గుర్తింపు, కష్టానికి తగిన ఫలితం దక్కడం లేదని చెప్పే రచయితలు కొందరితో నేను మాట్లాడాను. అందుకే ఎగ్జైట్ చేసే స్క్రిప్టులతో వచ్చే టాలెంటెడ్ రైటర్స్ కోసం ఒక వేదికగా ఈ టాలెంట్ హంట్ ను ఏర్పాటు చేస్తున్నాం. ఆహా, అమృత ప్రొడక్షన్స్ సహకారంతో టాలెంటెడ్ రైటర్స్ కు మంచి అవకాశాలు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నాం. ప్రతిభావంతులైన రచయితలను ఈ టాలెంట్ హంట్ కు ఆహ్వానిస్తున్నాం. అన్నారు.

రైటర్స్ టాలెంట్ హంట్ లో పాల్గొనాలనుకునేవారు కామెడీ, థ్రిల్లర్, డ్రామా, హర్రర్, రొమాన్స్ మరియు యాక్షన్ వంటి వివిధ జానర్స్ లో తమ రచనలను పంపించవచ్చు. మరిన్ని వివరాలు ఆహా ఓటీటీ, ఆహా సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ లో చూడవచ్చు. (Story : ‘రైటర్స్ టాలెంట్ హంట్’ అనౌన్స్ చేసిన  ఆహా ఓటీటీ)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!