UA-35385725-1 UA-35385725-1

ఈ నెల 10న మెగా డీఎస్‌సీ ఉచిత శిక్షణ స్క్రీనింగ్‌ టెస్ట్‌

ఈ నెల 10న మెగా డీఎస్‌సీ ఉచిత శిక్షణ స్క్రీనింగ్‌ టెస్ట్‌

జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో హాల్‌టికెట్లు

న్యూస్‌ తెలుగు/విజయవాడ : మెగా డీఎస్‌సీ కోసం రాష్ట్ర ప్రభుత్వం అందించే ఉచిత శిక్షణకు ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ పరీక్ష ఈ నెల 10న జరగనుందని జిల్లా సాంఘిక సంక్షేమ, సాధికారత అధికారి కె.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 749 మంది ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు హాల్‌టికెట్లు జ్ఞానభూమి పోర్టల్‌లో అందుబాటులో ఉన్నట్లు అభ్యర్థులకు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. ఉదయం 9.30 గంటలకల్లా పరీక్షా కేంద్రానికి రావాలతని,Mega DSC, Hall Ticket, Aadhaar Card, Driving License, PAN Cardవంటి ఏదైనా గుర్తింపు కార్డు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలు తీసుకురావాలన్నారు. నగరంలోని కేబీఎన్‌ డిగ్రీ కళాశాల, ఎనికేపాడు ఎస్‌ఆర్‌కే ఇంజనీరింగ్‌ కళాశాల, నున్న వికాస్‌ ఇంజనీరింగ్‌ కాలేజీ, మైలవరం లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్‌ కళాశాల కేంద్రాల్లో పరీక్ష జరగనుందని తెలిపారు. ఇతర సమాచారానికి జిల్లా సాంఘిక సంక్షేమ కార్యాలయ హెల్ప్‌లైన్‌ నంబర్లు 7989027826, 7075624856)లో సంప్రదించాలని సూచించారు.
ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవా
డీఎస్‌సీ-ఎస్‌జీటీ పరీక్షకు బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా అందించే ఉచిత శిక్షణకు అర్హులైన అభ్యర్థులు ఈ నెల 12వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ఏపీ బీసీ స్టడీ సర్కిల్‌ జిల్లా డైరెక్టర్‌ కె.శ్రీనివాసరావు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాకు చెందిన బీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీ అభ్యర్థులు తమ దరఖాస్తుతో బయోడేట, కుల, ఆధాయ ధ్రువీకరణపత్రాలు, టీసీ, పదో తరగతి, ఇంటర్‌, డిగ్రీ మార్కుల జాబితాలు, టెట్‌ మార్కుల జెరాక్సు కాపీలను జతపర్చాలని తెలిపారు. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదని, మెరిట్‌ ప్రాతిపదికన అభ్యర్థులను ఎంపికచేసి 60 రోజుల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టైఫండ్‌, స్టడీ మెటీరియల్‌ ఇవ్వనున్నట్లు తెలిపారు. (Story : ఈ నెల 10న మెగా డీఎస్‌సీ ఉచిత శిక్షణ స్క్రీనింగ్‌ టెస్ట్‌)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Jacqueline Fernandez Latest Pics
UA-35385725-1