ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం శుభాకాంక్షలు
న్యూస్ తెలుగు/విజయవాడ : నవంబర్ 8వ తేదీ ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర పట్టణ ప్రణాళిక సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో సంఘం ప్రతినిదులు అధికారులు, సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర పట్టణ ప్రణాళిక సంఘం అధ్యక్షుడు కె.వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు అబ్దుల్ సత్తార్, కార్యదర్శి మోహన్‌బాబు, రాష్ట్ర పట్టణ ప్రణాళిక సంచాలకులు ఆర్‌జే.విద్యుల్లత, అదనపు సంచాలకులు శ్రీనివాసులు, పట్టణ ప్రణాళిక ముఖ్య అధికారి ప్రభాకర్‌రావు, రాష్ట్ర పట్టణ, గ్రామ సంచాలకులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యుల్లత మాట్లాడుతూ ప్రస్తుత దేశ, రాష్ట్ర అభివృద్ధిలో పట్టణ ప్రణాళిక శాఖ ప్రముఖ పాత్ర పోషిస్తుండటంతో పాటు పట్టణ ప్రణాళిక మౌలిక సదుపాయముల కల్పనలో, పట్టణాలు ప్రణాళిక బద్దంగా అభివృద్ధి చెందేందుకు భాద్యతగా వ్యవహరిస్తోందని తెలిపారు. పట్టణ ప్రణాళిక సిబ్బంది, పట్టణ ప్రణాళిక ప్రాముఖ్యతను ప్రజల్లోకి తీసుకువెళ్ళి, ప్రణాళిక బద్ధంగా గృహ నిర్మాణాలు చేపట్టేందుకు సహాకరించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీపీఓ జోనల్ ప్రెసిడెంట్ వసీం బేగ్, టీపీఓ శైలజ, ట్రెజరర్ కృష్ణ, ప్లానింగ్ ఆఫీసర్ నాయుడు, పట్టణ ప్రణాళిక అధికారులు పాల్గొన్నారు. (Story : ప్రపంచ పట్టణ ప్రణాళిక దినోత్సవం శుభాకాంక్షలు)