జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు
అన్ని హంగులతో కూడిన స్టేడియం
స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : వనపర్తి జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడంతో పాటు, వనపర్తి పరిసర ప్రాంతాల క్రీడాకారులకు మెరుగైన క్రీడా శిక్షణ ఇచ్చేందుకు అవసరమైన అన్ని సదుపాయాలతో కూడిన క్రీడా ప్రాంగణాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ కే శివసేనారెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లా కేంద్రంలో ప్రతిపాదిత క్రీడా ప్రాంగణ నిర్మాణ పనుల పై ఆయన అధికారులతో సమావేశం నిర్వహించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్ ను ఏర్పాటు కోసం దాదాపు 30 ఎకరాల అనువైన భూమిని జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి తో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిపాదిత క్రీడా ప్రాంగణంలో హాకీ మైదానం స్విమ్మింగ్ పూల్,జిమ్ హాల్ తోపాటు ఇతర క్రీడాంశాలకు శిక్షణ ఇచ్చే విధంగా స్టేడియాన్ని నిర్మించడానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోనే మెరుగైన క్రీడా శిక్షణ అందే విధంగా అధునాతనమైన సౌకర్యాలతో కూడిన స్టేడియాన్ని నిర్మించాలని ఆయన అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, జిల్లా రెవెన్యూ, పంచాయతీరాజ్,
ఆర్ అండ్ బి అధికారులు ,స్పోర్ట్స్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్లు చంద్రారెడ్డి రవీందర్ ఇంజనీర్ అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. (Story : జిల్లా కేంద్రంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు)