Home వార్తలు తెలంగాణ కుల గణన సర్వేలో అధికారులకు సహకరించాలి

కుల గణన సర్వేలో అధికారులకు సహకరించాలి

0

కుల గణన సర్వేలో అధికారులకు సహకరించాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వేలో ప్రతి ఒక్కరు అధికారులకు సహకరించి పూర్తిస్థాయిలో కుటుంబ వివరాలను నమోదు చేయించాలని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గ్రామాల్లో అధికారులు చేపట్టిన ఇంటింటి సర్వే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు విధిగా పాల్గొని ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలను పూర్తిస్థాయిలో నమోదయ్యేలా చూడాలని ఎమ్మెల్యే సూచించారు. వలసలు వెళ్లిన వారి కుటుంబ వివరాలను, డోర్ లాక్ చేయబడి ఉన్న కుటుంబ వివరాలను సైతం నమోదు చేయించాలన్నారు. యుద్ధ ప్రాతిపదికన జరిగే ఈ సర్వేలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రంలోనే వనపర్తి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ అయ్యేవిధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. (Story : కుల గణన సర్వేలో అధికారులకు సహకరించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version