బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి
టిడిపి ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : బాల్య వివాహాలపై 25వ వార్డులోని ప్రజలకు పూర్తిగా అవగాహన కల్పించాలని టిడిపి ఇన్చార్జ్ భీమనేని ప్రసాద్ నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా వారు సచివాలయంలో సచివాలయ ఉద్యోగస్తులకు సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు బాల్య వివాహాలను పూర్తిగా నిషేధించాలని, ప్రజల్లో చైతన్యం పరిచేలా బాల్యవివాహాలను అరికట్టాల్సిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. బాల్యవివాహాలను 18 సంవత్సరాల లోపు చేయరాదని, అలా చేస్తే చట్టపరంగా పడే ఇబ్బందులు తదితర సమస్యలను ప్రజలకు అవగాహన కల్పించినప్పుడే, బాల్య వివాహాలు జరగవు అని తెలిపారు. తదుపరి 25వ వార్డుకు బాల్యవివాహాల జరగకుండా ఓ కమిటీని ఏర్పాటు చేస్తూ చైర్మన్గా భీమినేని ప్రసాద్ నాయుడు, సచివాలయ అడ్మిన్ సాయి ప్రకాష్, పాఠశాల హెచ్ఎం నాగప్ప, గ్రామ సమైక్య సభ్యురాలు పుష్పలత, ఏఎన్ఎం కాత్యాయని, అంగన్వాడీ కార్యకర్త తులసమ్మ, రక్షిత, కన్వీనర్ గా మహిళా పోలీస్ ఉమాదేవిలను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.(Story : బాల్య వివాహాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి)