Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి

ఏఐఎస్టిఎఫ్ జాతీయ ఆర్ధిక కార్యదర్శి సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు

న్యూస్‌తెలుగు/వినుకొండ :  పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేసి కమిటీ నివేదిక వచ్చేవరకు వెంటనే 35% మధ్యంతర భృతిని ప్రకటించాలని, గురువారం వినుకొండలోని సిపిఐ కార్యాలయం, శివయ్య భవన్ లో జరిగిన ఎస్టియు ప్రాంతీయ సమావేశంలో ఏఐఎస్టిఎఫ్ జాతీయ ఆర్థిక కార్యదర్శి శ్రీ సిహెచ్ జోసెఫ్ సుధీర్ బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రోపాధ్యాయ సంఘం వినుకొండ ప్రాంతీయ కార్యదర్శి వి.ఆంజనేయులు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జాతీయ ఆర్థిక కార్యదర్శి పాల్గొని గత ప్రభుత్వం పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసినప్పటికీ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు కూడా తీసుకోకుండా కమిటీ నిర్వీర్యం అయిందని, ఈ ప్రభుత్వం ఏర్పాటు అయ్యి నాలుగు నెలలు కావస్తున్న ఇప్పటిదాకా పి ఆర్ సి కమిటీ గురించి కనీసం ఊసెత్తడం లేదని వెంటనే పిఆర్సి కమిటీని ఏర్పాటు చేసి కమిటీ నివేదిక వచ్చేవరకు వెంటనే 35% మధ్యంతర భృతిని ప్రకటించాలని కోరారు. ఎన్నికల హామీలలో ఉద్యోగ ఉపాధ్యాయులకు ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని చెప్పిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మరియు పక్క రాష్ట్రాలు సైతం డీఏలు ప్రకటించినప్పటికీ ఒక్క డిఏ కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదని, పెరుగుతున్న జీవన ప్రమాణాల మేరకు మరియు నిత్యావసర ధరల పెరుగుదల మేరకు, కరువు భత్యాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని ఉద్యోగులకు సుమారు 26 వేల కోట్లు పెండింగ్ బకాయిలు ఉన్నాయని గత ప్రభుత్వం వీటి గురించి కనీసం ఆలోచించలేదని, ఎన్నికల హామీలలో వీటిని క్లియర్ చేస్తామని చెప్పిన కారణంగా పెండింగ్ బకాయిలను విడుదల చేసి రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయుల మన్ననలను చూరగొనాలని కోరారు. రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు జడ్పిపిఎఫ్ మరియు ఏపీ జి ఎల్ ఐ బకాయిల సైతం పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని కోరారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న లీడర్షిప్ మరియు ఎఫ్ఎల్ఎన్ ట్రైనింగు లకు సంబందించి నిన్న ఆరిగిరిపల్లి ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ కేంద్రంలోని ఉండి ప్రధానోపాధ్యాయులు మృతి చెందారని, బాపట్ల శిక్షణ కేంద్రంలోనూ ఉపాధ్యాయులు అస్వస్థతకు గురైనారని కనుక రెసిడెన్షియల్ విధానంలో శిక్షణలను రద్దుచేసి ప్రతి మండల కేంద్రాలలో ఆరు రోజులకు బదులుగా మూడు రోజులు నాన్ రెసిడెన్షియల్ విధానంలో ట్రైనింగులు జరపాలని డిమాండ్ చేశారు. వారి మృతికి సమావేశం సంతాపాన్ని ప్రకటించి వారి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా శిక్షణ కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశానికి మరో ముఖ్యఅతిథిగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు ఎల్వి రామిరెడ్డి మాట్లాడుతూ. ఎన్నికల హామీ మేరకు ఇచ్చిన సిపిఎస్ రద్దును వెంటనే అమలు చేసి రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఒకే పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. 117 జీవోను రద్దు చేస్తామని చెప్పిన ఎన్నికల హామీ మేరకు వెంటనే ఆ జీవోను రద్దు చేసి మూడు నాలుగు ఐదు తరగతుల విలీన ప్రక్రియను ఆపివేసి ప్రాథమిక పాఠశాలల బలోపేతానికి కృషి చేయాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి యు చంద్రజిత్ యాదవ్ మాట్లాడుతూ. యాప్ ల భారం లేకుండా చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ దిశగా పనిచేయడం లేదని, వెంటనే యాప్ భారం తగ్గించి పాఠశాలలలో బోధన కే ఉపాధ్యాయులను పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అపార్ గురించి ప్రధానోపాధ్యాయుల మీద ఒత్తిడి లేకుండా దానికి సంబంధించి తగు సమయం ఇవ్వాలని ఐడీల జనరేషన్ లో భాగంగా వచ్చిన సాంకేతిక సమస్యలను వెంటనే తొలగించేలా ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్థిక కార్యదర్శి ఈ ఏమండీ, జిల్లా అసోసియేట్ అధ్యక్షులు షేక్ మహబూబ్ సుభాని, జిల్లా ఉపాధ్యక్షులు వెంకట్ రెడ్డి, వినుకొండ ప్రాంతీయ పరిధిలోని అన్ని మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, సీనియర్ నాయకులు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. (Story : పిఆర్సి కమిటీని వెంటనే ఏర్పాటు చేయాలి)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!