రీ సర్వేలో సబ్ డివిజన్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి
డి ఏ ఓ.. కతిజున్ కుప్రా
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : రీ సర్వేలో సబ్ డివిజన్ పరిధిలోని దరఖాస్తులు అన్నింటి కూడా వెంటనే పరిష్కరించాలని డిఏఓ కతిజూన్ కుప్రా తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో మహేష్ ఆదేశాల మేరకు డివిజన్లోని మండల తాసిల్దారులు, మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లతో సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం కతిజున్ కుప్రా మాట్లాడుతూ కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి మహేష్ ఆదేశాల మేరకు రీ సర్వే పూర్తి అయిన వివరాలను వెనివెంటనే పంపాలని తెలిపారు. ఎఫ్ లైన్స్, పట్టా సబ్ డివిజన్స్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు స్వీకరించిన అర్జీలు, సర్వీస్ లెవెల్ అగ్రిమెంటు లోపు పూర్తి చేయాలని వారు తెలిపారు. అదేవిధంగా రీ సర్వే గ్రామసభలలో వచ్చిన అర్జీలకు నోటీసులను వెంటనే జారీచేసి, పొలము వద్ద హాజరైన పట్టాదారుల అందరి అంగీకరణతో నివేదికను తీసుకొని, మండల సర్వేయర్లు, తాసిల్దార్ల లాగిన్ లో నుండి సర్వే భూమి రికార్డుల అధికారి పుట్టపర్తి వారికి పంపి వారితో అంగీకారం తీసుకోవాలని తెలిపారు. అనంతరం ఎల్ పి ఎం కరెక్షన్ మోడ్యూల్ ద్వారా పూర్తి చేసి రీ సర్వే జరిగిన గ్రామాలలో రైతుల సమస్యలు పరిష్కరించాల్సిందిగా వారు తెలిపారు. రీ సర్వే గ్రామసభల యందు జాయింట్ ఎల్పీఏములు కేటాయించిన రైతుల దాఖలు చేసిన సబ్ డివిజన్ దరఖాస్తులు వెనువెంటనే పరిష్కరించాలని ఈ సమావేశంలో తెలపడం జరిగిందని వారు తెలిపారు. ఈ శిక్షణ సమావేశంలో ఏడు మండలాల తాసిల్దార్లు, డివిజనల్ ఇన్స్పెక్టర్లు అంజలీదేవి, మురళీకృష్ణ ,శామ్యూల్ బాబు, అన్ని మండలాల మండల సర్వేయర్లు, గ్రామ సర్వేయర్లు, మాస్టర్ ట్రైనర్స్, పరిగి మండల డిప్యూటీ సర్వేయర్ కవిత తదితరులు పాల్గొన్నారు. (Story : రీ సర్వేలో సబ్ డివిజన్ దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి)