Home వార్తలు తెలంగాణ పోటీ పరీక్షలకు సంసిద్ధమవ్వాలి

పోటీ పరీక్షలకు సంసిద్ధమవ్వాలి

0

పోటీ పరీక్షలకు సంసిద్ధమవ్వాలి

న్యూస్ తెలుగు/ వనపర్తి : విద్యార్థులు పోటీ పరీక్షలకు సంసిద్ధమవుతూ తమ బంగారు భవిష్యత్తు కోసం బాటలు ఏర్పరచుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలే తప్ప రెచ్చగొట్టే ప్రసంగాలను పట్టించుకోకూడదని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర విద్యార్థులలో లోకానికి సూచించినట్లు ఎమ్మెల్యే మేఘారెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాత్రి జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి గారి నివాసంలో మంచిర్యాల నియోజకవర్గ విద్యార్థులతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ తాము తల్లిదండ్రులకు దూరంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వసతి గృహాల్లో, గురుకులాల్లో ఉంటూ చాలీచాలని డైట్ మరియు కాస్మోటిక్ చార్జీలతో ఇన్నాళ్లు ఇబ్బందులు ఎదుర్కొన్నామని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 40శాతం….
1330 రూపాయల వరకు చార్జీలను పెంచి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 8 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులను తొలగించిందని విద్యార్థులు ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేసినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ పాలనలో విద్యా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థను అన్ని రకాలుగా పటిష్టపరిచి నాణ్యమైన విద్యాబోధన తో పాటు క్రీడ రంగాన్ని సైతం బలోపేతం చేస్తుందని ఎమ్మెల్యే అన్నారు. ప్రభుత్వ పాఠశాలు, కళాశాలలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు స్కిల్ యూనివర్సిటిని ఐటీఐలను ఏటీసీలుగా మార్చేందుకు చర్యలు చేపట్టామన్నారు. స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు తో పాటు విద్యావ్యవస్థను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోయేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ అహర్నిశలు శ్రమిస్తుందని తెలిపారు. డ్రాపవుట్స్‌ను తగ్గించడానికి యువజన సంఘాలు చొరవ చూపాలని, గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాల బారిన పడొద్దని కోరారు. రాజకీయ పార్టీల రెచ్చగొట్టే ప్రకటనలను నమ్మొద్దని, విద్యార్థులు, నిరుద్యోగులు పోటీ పరీక్షలకు సిద్దం కావాలని సూచించారు.
ఈ సమావేశంలో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి గారితో పాటు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి , నారాయణపేట ఎమ్మెల్యే పర్ణిక రెడ్డి గారు,ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి , మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సురేఖ ప్రేమ్ సాగర్ రావు పాల్గొన్నారు. (Story : పోటీ పరీక్షలకు సంసిద్ధమవ్వాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version