నీరు ఉంటేనే రైతులు, గ్రామాలు ఉంటాయి
ధర్మవరం నియోజకవర్గంలో అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించాలన్నదే లక్ష్యం
టిడిపి నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : నీరు ఉంటేనే రైతులు గ్రామాలు సస్యశ్యామలంగా ఉంటాయని, ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలకు సాగునీరు అందించాలన్నదే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యము అని ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ తెలిపారు. ఈ సందర్భంగా వారు రావులచెరువు గ్రామానికి నీటిని విడుదల చేసి, రైతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ జిల్లాలో హార్టికల్చర్ హక్కుగా మార్చడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యొక్క ముఖ్యము అని, ధర్మవరం చెరువు పూర్తిస్థాయిలో నిండి మరువ పారుతున్న నేపథ్యంలోనే రావులచెరువు గ్రామానికి నీరుని విడుదల చేయడం జరిగిందని తెలిపారు.ఏడవ మరువ వద్ద గంగపూజ చేసి తూములు ఎత్తి రావులచెరువుకు నీరు విడుదల చేశారు. దీంతో ఆ ప్రాంత రైతాంగం అంతా పరిటాల శ్రీరామ్ కు కృతజ్ఞతలు తెలిపారు. అక్కడ ఒక పండుగ వాతావరణం కనిపించింది. ప్రస్తుతం రావులచెరువుకి నీరు విడుదల చేశామని… ఈ మార్గంలో మల్లాకాల్వ, సి.బత్తలపల్లి ప్రాంతాల్లో కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని వారు అభిప్రాయపడ్డారు. ధర్మవరం చెరువు నుంచి వీలైనన్ని ఎక్కువ ప్రాంతాలకు సాగునీరు అందించే విధంగా అధికారులతో చర్చిస్తున్నామన్నారు. గతంలో నిర్జీవంగా మారిన సాగునీటి వనరులకు ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో జీవం పోస్తున్నామని వివరించారు.2014-19 సమయంలో పెద్ద ఎత్తున డ్రిప్పు, స్ప్రింక్లర్లు ఇచ్చి రైతులను ప్రోత్సహించారన్నారు. గత ఐదేళ్లలో ఇలాంటి పరిస్థితి ఎక్కడా లేదన్నారు. ఇప్పుడు మరోసారి డ్రిప్పు, స్ప్రింక్లర్లు సబ్సిడీతో అందిస్తున్నారని రైతులు దీనిని సద్వినియోగం చేసుకొని, నీటిని ఆదా చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి,జనసేన, బిజెపి నాయకులు పాల్గొన్నారు. (Story : నీరు ఉంటేనే రైతులు, గ్రామాలు ఉంటాయి)