సీతంలో టి.సి.ఎస్. వారిచే ఇంటరాక్టివ్ సెషన్
న్యూస్ తెలుగు/విజయనగరం : స్థానిక గాజులరేగ పరిధిలోగల సీతం ఇంజనీరింగ్ కళాశాలలో
బిల్డింగ్ సొల్యూషన్సన్ “ఎ బడ్డింగ్ ఇంజనీర్స్ స్టార్టర్ కిట్” అనే ఇంటరాక్టివ్ సెషన్ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి టి.సి.ఎస్. సంస్థకు చెందిన ఐటి అనలిస్ట్ భాను పవన్ రిసోర్స్ పర్సన్‌గా విచ్చేశారు. ఈ సందర్భంగా ఔత్సాహిక ఇంజనీర్లకు అవసరమైన అంశాలపై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. డేటా సైన్స్, ప్రోగ్రామింగ్, కోడింగ్, డేటా సెట్‌లు, సైబర్ సెక్యూరిటీ మరియు బి.ఐ.ఒ.ఎస్ వంటి రంగాలను గురించి వివరించారు. వృత్తిలో రాణించడానికి ద్వంద్వ లక్ష్యాలను ఏర్పరచుకోవడం యొక్క ప్రాముఖ్యతను అతను వివరించారు . అలాగే హ్యాండ్-ఆన్, అప్లికేషన్-ఓరియెంటెడ్ లెర్నింగ్ యొక్క ప్రాముఖ్యతను చర్చించారు విద్యార్థులు తమ కెరీర్ లో అవకాశాలను మెరుగుపర్చడానికి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై అవగాహన ఏర్పరచుకోవాలని సూచించారు. భవిష్యత్ అవకాశాల కోసం తమను తాము మెరుగ్గా ఉంచుకోవడానికి వారి విశ్లేషణాత్మక, తార్కిక నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని విద్యార్థులను కోరారు. ఈ కార్యక్రమంలో సీతం డైరెక్టర్ డాక్టర్ మజ్జి. శశిభూషణరావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి.వి. రామమూర్తి, అధ్యాపకులు, మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు.(Story:సీతంలో టి.సి.ఎస్. వారిచే ఇంటరాక్టివ్ సెషన్)