స్వచ్ఛభారత్ గ్రీన్ అంబాసిడర్స్ వర్కర్స్ కి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలి
ఏఐటీయూసీ డిమాండ్
న్యూస్‌తెలుగు/ వినుకొండ : వినుకొండ నియోజకవర్గం లో పనిచేస్తున్నటువంటి స్వచ్ఛభారత్ కార్మికులకి నెలలు గడుస్తున్న జీతాలు ఇవ్వకపోవడం విచారకరమని సోమవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో వినుకొండ శివయ్య స్తూపం వద్ద సోమవారం స్వచ్ఛభారత్ కార్మికుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు మాట్లాడుతూ. “నియోజకవర్గంలోని గ్రామపంచాయతీలో పని చేస్తున్న స్వచ్ఛభారత్ కార్మికులకు వెంటనే పెండింగ్ జీతాలు విడుదల చేయాలని, అలాగే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, ప్రభుత్వాలు మారినప్పుడల్లా మీరు పనుల్లో మానుకోండి మా పార్టీ వారిని పెట్టుకుంటామని రాజకీయ వేధింపులు చేయటం సబబు కాదని బూదాల అన్నారు. ఎన్ డి ఏ కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తలో కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పట్నాలతోపాటు, గ్రామాలు కూడా పరిశుభ్రంగా ఉంచాలని లక్ష్యంతో స్వచ్ఛభారత్ కార్మికుల వ్యవస్థను ఏర్పాటు చేసి పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన కార్మికులు ఏర్పాటుచేసి గ్రామాలు పరిశుభ్రంగా ఉంచుతున్నారు. ఆరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఏర్పాటు చేసిన ఈ కార్మికులను మళ్లీ చంద్రబాబు నాయుడు వస్తారు మా గోడు వింటారు సమాన పనికి సమాన వేతనం ఇస్తారు అని ఆశగా ఎదురుచూస్తున్న కార్మికులను నేటి పాలకులు, ప్రభుత్వాలు మారాయి కాబట్టి మీరు పనులు మానుకోవాలని ఆ స్థానంలో మాకు సంబంధించిన వారు ఏర్పాటు చేసుకుంటామని చెప్పటం ఎంతవరకు న్యాయమని, ఇదే కొనసాగితే నియోజకవర్గం లో ఉన్న కార్మికుల అందరితో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని బూదాల శ్రీనివాసరావు ప్రభుత్వం పై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛభారత్ కార్మికులు, నాయకులు పిన్నబోయిన వెంకటేశ్వర్లు, కొప్పరపు మల్లికార్జున, ముప్పాళ్ళ మల్లేశ్వరరావు ,మొండితోక పౌలు, బందెల సుధాకర్, ఈ.పేరయ్య, మన్నం నరసింహ, బక్క ఏసుబాబు, ఉప్పులూరి పేరయ్య, తదితర స్వచ్ఛభారత్ కార్మికులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. (Story : స్వచ్ఛభారత్ గ్రీన్ అంబాసిడర్స్ వర్కర్స్ కి పెండింగ్లో ఉన్న జీతాలను వెంటనే విడుదల చేయాలి)