Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ నకిలీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన వందలాది ఎకరాల

నకిలీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన వందలాది ఎకరాల

0

నకిలీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన వందలాది ఎకరాల

పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఉడుజర్ల గ్రామ రైతులకు నందీశ్వర విత్తనాల కంపెనీ నుండి నష్టపరిహారం ఇప్పించి కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలి
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము

న్యూస్‌తెలుగు/వినుకొండ‌ : ఆదివారం ఉదయం పల్నాడు జిల్లా ఈపూరు మండలం ఉడుజర్ల గ్రామంలో నందీశ్వర బి బి టి రకం వరి విత్తనాలను ఊడుజర్ల గ్రామంలో వందలాది ఎకరాల్లో ఈ వరి విత్తనాలను ఏసి నష్టపోయామని ఆ గ్రామ రైతులు ఫోను ద్వారా తెలియపరచగా ఈరోజు ఉదయం ఆ గ్రామానికి వెళ్ళటం జరిగింది ఆ గ్రామ రైతులతో కలిసి వారి వరి పొలాలను పరిశీలించగా వారు ఏదైతే కేలీలు అని చెప్తున్నారు ఆ పైరుకి మిగతా పైరుకి వ్యత్యాసం కనిపించింది ఈ పైరు ఆ పైరు కంటే ఒక జానా ఎత్తు ఎక్కువగా ఉండటం కంకి వచ్చి విత్తనముగా తయారవడం విత్తనం లావుగా ఉండటం కనిపించింది అక్కడ ఉన్న రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము కి వివరిస్తూ విత్తనాల్లో లోపం ఉండటంవల్లనే పైరుకు పైరుకు ఒకే ఎకరంలో వ్యత్యాసం ఉందని కేలీలు ఎక్కువగా ఉన్నాయని దీని ద్వారా ఎకరాకు 15 క్వింటాల వరకు నష్టం వస్తుందని వీరిలో చాలామంది కౌలు రైతులు ఉన్నారని ఒక ఎకరాకు 20వేల రూపాయలు కవులు కట్టాల్సి ఉందని ఇప్పటివరకు ఎకరాకు 40 వేల రూపాయలు పెట్టుబడి అయిందని రైతులు రాము వద్ద వారి ఆవేదనను వ్యక్తం చేశారు రైతులను ఉద్దేశించి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉలవలపూడి రాము మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా వర్షాలు లేక నాగార్జునసాగర్ కుడి కాలవ కింద రైతులు వరి పంటసాగు చేయలేక పోయారని ఈ ఏడాది ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు బాగా పడటంతో నాగార్జునసాగర్ నిండుకుండలా ఉండటంతో కుడి కాలువ కింద రైతులు ఎక్కువమంది వరిసాగు వైపు మొగ్గు చూపారని అయితే కావాల్సినంత వరి విత్తనాలు మన రాష్ట్రంలో లేకపోవడంతో పక్క రాష్ట్రాల నుండి వరి విత్తనాలను తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని రాము ఈ సందర్భంగా చెప్పడం జరిగింది అనంతరం వ్యవసాయ అధికారులకు ఫోన్ చేసి విషయాన్ని వివరించడం జరిగింది. వారు మా దృష్టికి ఇంతవరకు రాలేదని వెంటనే సంబంధించిన విత్తనాల కంపెనీ వారితో మాట్లాడి పొలాలను పరిశీలిస్తామని రైతులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మన జిల్లాలో ఏరియా పొటాషియం మరికొన్ని ఎరువుల కొరత ఉందని వాటిని కూడా రైతులకు ప్రభుత్వం అందుబాటులో తేవాలని ఏదైతే నష్టపోయిన ఊడిజర్ల రైతులకు కౌలు పలు రైతుకు ఎకరాకు 35 వేల రూపాయలు నందీశ్వర కంపెనీ ద్వారా నష్టపరిహారం ఇప్పించాలని అదేవిధంగా సొంత పొలం ఉన్నవారికి ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారాన్ని కంపెనీ ద్వారా ఇప్పించి కూటమి ప్రభుత్వం రైతులకు మేలు చేయాలని రాము రైతుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

ఈ కార్యక్రమంలో ఆ గ్రామ బాధిత రైతుల మాతకుంట సాయి రెడ్డి రామిరెడ్డి. మూలే ఏడుకొండలు రెడ్డి టికెట్ శివయ్య పెద్దిరెడ్డి తాటి ఏదయ్య కాశిరెడ్డి కొండారెడ్డి బచ్చు కొండ గురునాథరెడ్డి సంజీవరెడ్డి మరి కుమార్ రెడ్డి యార్లగడ్డ అంజయ్య కృష్ణారెడ్డి ఎర్రం అంజిరెడ్డి కంటేశ్వర్ రెడ్డి నాసిన బ్రహ్మయ్య మరికొందరు రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. (Story : నకిలీ వరి విత్తనాల వల్ల నష్టపోయిన వందలాది ఎకరాల)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version