థర్డ్ డిగ్రీ చేసిన అటవీ అధికారులను సస్పెండ్ చేయాలి
ఎమ్మెల్యే డా.హరీష్ బాబు
న్యూస్ తెలుగు / కొమరం భీం. ఆసిఫాబాద్ జిల్లా : హైదరాబాద్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశం లో ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు మాట్లాడాతు కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఫారెస్ట్ అధికారుల దౌర్జన్యాలకు అంతులేకుండా పోతుందని, ఈ విషయంపై ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ కలిసినట్లు తెలిపారు.సిర్పూర్ రేంజ్ పరిధిలో రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన అధికారుల పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సోమవారం ఉదయం నుంచి పెద్ద ఎత్తున రైతుల ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేస్తానని ఎమ్మెల్యే వెల్లడించారు (Story : థర్డ్ డిగ్రీ చేసిన అటవీ అధికారులను సస్పెండ్ చేయాలి )