Home వార్తలు తెలంగాణ మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి

మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి

0

మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి

న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : నేషనల్ మెడికల్ కౌన్సిల్ నిబంధనల ప్రకారం జిల్లా కేంద్రం లో నూతన మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర్ టి. ఎస్. సంబంధిత అధికారులను ఆదేశించారు.శనివారం జిల్లా కేంద్రంలో నూతన మెడికల్ కళాశాల భవన నిర్మాణ పనులను క్షేత్ర స్థాయిలో ముందుగా మెడికల్ కళాశాల లో క్లాస్ రూమ్స్, లెక్చర్ హాల్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీస్ రూమ్, లైబ్రరీ, ల్యాబ్, హాస్టల్, మెస్, టాయిలెట్స్ లలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెడికల్ కళాశాలలో తరగతులు కావాల్సిన అవసరమైన వసతి సౌకర్యం సమకూర్చాలని కలెక్టర్ సూచించారు. ఒకసారి కళాశాల తరగతులు ప్రారంభించిన తర్వాత మళ్లీ ఎలాంటి సమస్య ఉత్పన్నం కాకూడదని ఆయన తెలిపారు. తరగతుల కు సరిపడా ఫర్నిచర్ వచ్చిందా? ఇంకా ఏమైనా అవసరం ఉంటే సమకూర్చాలని, ప్రాక్టికల్స్ తరగతులను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. నర్సింగ్ కళాశాలకు కావల్సిన మొదటి బ్యాచుకు 2 రూములు, ల్యాబ్స్ పార్టేశన్ ఏర్పాటు చేయాలన్నారు. కలశాల ఏ బి సి , బ్లాకుల లో అన్ని పనులు పూర్తి 10 రోజుల్లో అప్పగించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో టి.జి.ఎం.ఐ.డి.సి. ఈ ఈ ప్రసాద్, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ మోహన్ లాల్, డి ఇ రాజశేఖర్, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ సుధా రాణి, వైస్ ప్రిన్సిపాల్ రాజమణి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.(Story:మెడికల్ కళాశాల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version