Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ పేద కుటుంబాలను ఆదుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం..

పేద కుటుంబాలను ఆదుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం..

0

పేద కుటుంబాలను ఆదుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం..

ఉచిత గ్యాస్ సిలిండర్లతో ఆర్థిక భారం తగ్గించారు

ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్య శాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : పేద కుటుంబాలను ఆదుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క ముఖ్య లక్ష్యము అని, ఉచిత గ్యాస్ సిలిండర్లతో ఆర్థిక భారమును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తగ్గించడం జరిగిందని ధర్మవరం ఎమ్మెల్యే, ఆరోగ్యశాఖ మంత్రివర్యులు సత్య కుమార్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ దారుడు గోవింద చౌదరి కార్యాలయ ఆవరణములో ఉచిత గ్యాస్ పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్యఅతిథిగా విచ్చేశారు. సత్య కుమార్ యాదవ్ తో పాటు రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ చేతన్, డీఎస్ఓ వంశీకృష్ణ, ఆర్డీవో మహేష్ పాల్గొన్నారు. అనంతరం ఈ ఉచిత గ్యాస్ యొక్క ఉపయోగాలను జిల్లా కలెక్టర్ తెలియజేశారు. తదుపరి మంత్రి సత్య కుమార్ యాదవ్ తో పాటు పరిటాల సునీత, చిలక మధుసూదన్ రెడ్డిలు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో గ్యాస్ విషయంలో రాష్ట్ర మహిళలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నారని, ఆ ఇబ్బందులను ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ను ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. ఈ మూడు సిలిండర్ల నగదును వారి వారి బ్యాంకు ఖాతాలో కూడా 48 గంటల లోపు నగదు జమ కావడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఐదు నెలల నుంచి పెన్షన్ను ప్రతినెల 1వ తేదీ లోపల ఇవ్వడం జరుగుతోందని తెలిపారు. కట్టెలు పొయ్యే ఉన్న ఇంటికి గ్యాస్ సిలిండర్ తెచ్చింది చంద్రబాబు నాయుడు అని, ఆరోజు దీపం పథకంతో మహిళలకు పొగ నుంచి విముక్తి కలిగించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా పరిటాల సునీత తెలిపిన మేరకు రేషన్ కార్డులు పెన్షన్లు తిరిగి తప్పక పునరుద్దిస్తామని మంత్రి హామీ ఇవ్వడం జరిగింది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా నేడు పెన్షన్ తో పాటు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇవ్వడం అనేది ఎన్డీఏ ప్రభుత్వము యొక్క ఘనత అని వారు తెలిపారు. అంతేకాకుండా గత 40 సంవత్సరాలుగా లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ దారులు గోవింద చౌదరి చేస్తున్న ఈ సేవలు పట్ల ప్రత్యేకంగా అభినందించడం జరిగిందని తెలిపారు. అంతేకాకుండా ఈ ఉచిత గ్యాస్ సిలిండర్లో ను పంపిణీ చేసేందుకు కూడా స్వయంగా ఇంటికి వెళ్లి పంపిణీ చేయడం మా అదృష్టంగా భావిస్తున్నట్లు వారు తెలిపారు. తొలుత ఉచిత గ్యాస్ సిలిండర్ లను పంపిణీ చేసేందుకు సిద్ధమైన ఆటోలకు జెండా ఊపి ప్రారంభించడం కూడా జరిగిందని తెలిపారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా సూపర్ సిక్స్ పథకాలను తప్పక ప్రజల దారిన చేర్చి తీరుతామని తెలిపారు. ఈ ఉచిత గ్యాస్ పథకం ద్వారా ఏడాదికి 2,684 కోట్లు ఖర్చవుతుందని తెలిపారు. గ్యాస్ వినియోగదారులు గ్యాస్ బుక్ చేసుకున్న 48 గంటల్లోనే మీ బ్యాంకు ఖాతాకు నేరుగా నగదు జమ అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వంలో రద్దు చేసిన పెన్షన్లను, రేషన్ కార్డులను, గ్యాస్ సిలిండర్లా వితరణ పై కూడా తప్పకుండా న్యాయం చేస్తామని వారు హామీ ఇచ్చారు. తదుపరి లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ దారులు గోవింద చౌదరి మాట్లాడుతూ గత 40 సంవత్సరాలుగా తాను తన పరిధిలోని అన్ని మండలాల లోని కుటుంబాలకు అడిగిన తక్షణమే గ్యాస్ సిలిండర్లను హెచ్పీసీఎల్ సలహాలు పాటిస్తూ ఎంతో క్రమశిక్షణతో ముందుకు వెళుతున్నానని తెలిపారు. అంతేకాకుండా గ్యాస్ వాడకంపై మా సిబ్బంది చేత గ్రామాలలో, పట్టణాలలో అవగాహన కల్పించి గ్యాస్ సిలిండర్ల సంఖ్యను కూడా పెంచడం జరిగిందని తెలిపారు. కరోనా సమయంలో కూడా మా సిబ్బంది ప్రాణాలకు తెగించి అవసరమైన వారికి గ్యాస్ సిలిండర్లను కూడా పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. తదుపరి మంత్రి సత్య కుమార్, రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ చేతన్, డీఎస్ఓ వంశీకృష్ణ గోవింద చౌదరిని వారి కుటుంబాన్ని కి అభినందనలు లను ప్రత్యేకంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేష్ తో పాటు, వివిధ విభాగాల అధికారులు, పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని మహిళలు, లక్ష్మీ గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. (Story : పేద కుటుంబాలను ఆదుకోవడమే ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం..)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version