వనపర్తి జిల్లాలో 241 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్వం సిద్ధం
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
న్యూస్‌తెలుగు/వనపర్తి : అన్నదాతలు పండించిన వరి ధాన్యాన్ని చివరి ప్రతి గింజ కొంటామని, సన్నాలు పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలను అదనంగా చెల్లిస్తామని అన్నదాతలు ఎవరు అధైర్య పడకూడదని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. శనివారం వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో మెప్మా, సహకార సంఘం, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 3 వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వనపర్తి జిల్లాలో మొత్తం 241 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని అందులో మహిళా సంఘాల ద్వారా ఒక 151, సహకార సంఘాల ద్వారా117, మెప్మా ద్వారా 2 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పదవులు పోయిన BRS నాయకులు అన్నదాతల పై ముసలి కన్నీరు కారుస్తూ…కాంగ్రెస్ ప్రభుత్వం పై దుష్ప్రచారాలు చేస్తున్నారని అలాంటి దుష్ప్రచారాలను ఎవరు కూడా నమ్మకూడదని ఎమ్మెల్యే సూచించారు. ప్రతి గ్రామంలో అవసరం ఉన్న మేరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని స్థానిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని అవసరమైతే మరికొన్ని సెంటర్లను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఎమ్మెల్యే తెలిపారు. కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యాన్ని తీసుకువచ్చే అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేలా అధికారులు ఏర్పాటు చేయాలని.., గన్ని బ్యాగులు, ప్లాస్టిక్ కవర్లు అందుబాటులో ఉంచుకోవాలని ప్రభుత్వ నిబంధనల ప్రకారం అన్నదాతలకు ఇబ్బందులు లేకుండా కొనుగోల్లు నిర్వహించాలని ఎమ్మెల్యే సూచించారు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించిన రైతుల పూర్తి సమాచారాన్ని నమోదు చేసుకోవాలని డబ్బులు చెల్లింపుల్లోనూ ఎటువంటి జాతీయం లేకుండా ఎప్పటికప్పుడు వివరాలను ఆన్లైన్లో పొందుపరుస్తూ ఉండాలని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో వనపర్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ పుట్టపాక మహేష్ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు, మెప్మా అధికారులు, సహకార సంఘాల సిబ్బంది మహిళా సంఘాల అధికారులు అన్నదాతలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు. (Story : వనపర్తి జిల్లాలో 241 కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు సర్వం సిద్ధం)