ఘనంగా జరిగిన జాతీయ ఐక్యత దినోత్సవం
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని స్థానిక కె హెచ్.ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎన్ ఎన్, ఎన్సీసీ, యూనిట్లు, అధికారి ఎస్ పావని, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రామ్ అధికారి డా.బి. గోపాల్ నాయక్ల ఆధ్వర్యంలో జాతీయ ఐక్యత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమానికి ముఖ్య అతిదిగా హాజరైన కళాశాల ప్రిన్సిపాల్ డా. కె.ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, స్వతంత్ర్య భారతదేశం తొలి ఉప ప్రధానిగా, ఉక్కు మనిషిగా, ధృడమైన సంకల్పంతో స్వతంత్ర్య పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించి సామాజిక, రాజకీయ నాయకుడిగా దేశ సమగ్రత, సమైక్యతకు మార్గ నిర్దేకులుగా నిలిచి దాదాపు 565 సంస్థానాలను విలీనం చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. మహనీయుని జయంతిని పురస్కరించుకొని భారత ప్రభుత్వం 2014 నుండి జాతీయ ఐక్యత దినోత్సవంగా జరుపుకొంటున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విద్యార్థులు, అధ్యాపక మరియు అధ్యాపకేత సిబ్బంది జాతీయ ఐక్యతా ప్రతిజ్ఞను నిర్వహించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో డా, ఎస్. షమీవుల్లా, డా. ఎస్.చిట్టెమ్మ, ఎం.భువనేశ్వరి, ఎ.కిరణ్ కుమార్, పుష్పవతి, సరస్వతి, మీనా, బి. ఆనంద్, హైమావతి తదితర అధ్యాపక, అధ్యాపకేతర బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. (Story : ఘనంగా జరిగిన జాతీయ ఐక్యత దినోత్సవం)