ముసాయిదా ఓటర్ జాబితాను ప్రకటించిన తహసిల్దార్ నటరాజ్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : జిల్లా కలెక్టర్, ఆర్డీవో ఆదేశాల మేరకు ధర్మవరం తాసిల్దార్ నటరాజ్ ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆ వివరాలను తెలుపుతూ ధర్మవరం రూరల్ లో మొత్తం 49 పోలింగ్ స్టేషన్లో కలవని, ఇందులో పురుషులు 17,246 కాగా మహిళలు 17,379, ఇతరులు 01 వెరసి 34,626 మంది కలరని తెలిపారు. అదేవిధంగా ధర్మవరం పట్టణంలో 108 పోలింగ్టేషనులకు గాను పురుషులు 52, 011 కాగా మహిళలు 53, 503, ఇతరులు 14 మంది వెరసి 1,05,528 మంది ఓటర్లు ని తెలిపారు. (Story : ముసాయిదా ఓటర్ జాబితాను ప్రకటించిన తహసిల్దార్ నటరాజ్)