క్రీడాలు ఆరోగ్యానికి ఉల్లాసాన్ని యిస్తాయి
ఐటిడిఏ పిఓ
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) : క్రీడాలు ఆరోగ్యానికి ఉల్లాసాన్ని ఇస్తాయి అని ఏటూరునాగారం ఐటిడిఏ ప్రాజెక్ట్ అధికారి చిత్ర మిశ్ర అన్నారు. మంగళవారం ఏటూరునాగారం కొమురం బీమ్ మినీ స్టేడియంలో, ఏటూరునాగారం ఐటిడిఏ ఆధ్వర్యంలో ఐటిడిఏ జోనల్ స్థాయి అండర్ 14, 17 బాలబాలికలకు క్రీడాలు నిర్వహించారు. ఈ క్రీడాలు మంగళవారం, బుధవారం రెండు రోజులు నిర్వహిస్తారు.ఈ కార్యక్రమంకు ముఖ్యఅతిధిగా ఐటిడిఏ పిఓ చిత్ర మిశ్ర హాజరై మాట్లాడుతూ విద్య తో పాటు, క్రిడల్లో కూడా విద్యార్థులు రాణించాలన్నారు. ముందుగా క్రీడాల జెండాను పిఓ ఎగురు వేసి, జ్యోతి ప్రజ్వలాన చేశారు. విద్యార్థులు చేసిన వివిధ రకాల నృత్యలతో, అధికారులను, విద్యార్థులను, ప్రజలను ఆకర్శించుకున్నాయి.ఈ కార్యక్రమంలో డిడి. వై పోచం, ఏటిడిఏ దేశిరాం,క్షేత్రయ్య, ఎస్ ఓ రాజ్ కుమార్, ఏసిఓయం కోడి రవీందర్, కరీంనగర్,ఉమ్మడి జిల్లా నుండి విద్యార్థులు బాలబాలికలు, సంబంధిత శాఖల అధికారులు, పిఇటిలు, పిడిలు, ఆదినారాయణ, భాస్కర్, శ్యామల,విద్యార్థులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు. (Story : క్రీడాలు ఆరోగ్యానికి ఉల్లాసాన్ని యిస్తాయి)