ఎన్ జి జి ఓ ఎస్ నూతన కమిటీ ఏర్పాటు
జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి
న్యూస్ తెలుగు /(శ్రీ సత్య సాయి జిల్లా) : పట్టణంలోని ఎన్జీవో హోం లో ఏ ఏపీ ఎన్జీజి ఓఎస్ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి చంద్రమోహన్, జిల్లా ఉపాధ్యక్షులు రవికుమార్, జిల్లా ట్రెజరీ అధ్యక్షులు ఫరూక్ అహ్మద్, జిల్లా ట్రెజరీ కోశాధికారి అనంతయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీని జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు. ఈ కమిటీలో చైర్మన్గా డి. శంకర్ నారాయణ, వైస్ చైర్మన్ గా-1 గా ఎస్. హరీష్ రావు, వైస్ చైర్మన్-2 గా ఎస్ సురేష్ నాయక్, కన్వీనర్ గా డి. శ్రీనివాసులు, క్యాషియర్ గా సి కృష్ణప్ప, ఈసీ మెంబర్ గా శ్రీ వెంకటరమణ, శ్రీ విష్ణువర్ధన్ రెడ్డి ను ఎంపిక చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, కార్యదర్శి చంద్రమోహన్, ఉపాధ్యక్షులు రవికుమార్లు మాట్లాడుతూ ఈ నూతన కమిటీలో ప్రతి ఒక్కరూ సమన్వయంతో పని చేస్తూ ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యల పరిష్కారానికి కీలకపాత్ర వహించాల్సిన అవసరమెంతైనా ఉందని వారు తెలిపారు. ఏదైనా ఉద్యోగ సమస్యల్లో అవసరాలు ఏవైనా ఉంటే జిల్లా కమిటీని నేరుగా సంప్రదించవచ్చునని తెలిపారు. తదుపరి నూతన కమిటీకి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నూతన కమిటీ చైర్మన్ శంకర్ నారాయణ మాట్లాడుతూ గత కమిటీలో ఎన్నో సమస్యలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని అన్నింటిని జిల్లా కమిటీ సహాయ సహకారములతో ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు. నా అనుభవంలో వివిధ ప్రభుత్వ ఉద్యోగాల సమస్యలను పరిష్కరించేందుకు నా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని, నా అండదంటలు కూడా ఉంటాయని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులకు భద్రత, ఇదివరకు రావలసిన బకాయిల విషయంలో కూడా తన వంతుగా కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జిల్లా కమిటీ వారు, స్థానిక ప్రభుత్వ ఉద్యోగులు, బంధుమిత్రులు అందరూ కలిసి నూతన కమిటీని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరం పెన్షన్ అసోసియేషన్ అధ్యక్షుడు చలపతి తో పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. (Story : ఎన్ జి జి ఓ ఎస్ నూతన కమిటీ ఏర్పాటు)