ఈనెల 30 న కౌన్సిల్ సమావేశం
మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయిజిల్లా) : పట్టణంలోని మున్సిపల్ కౌన్సిల్ హాల్ నందు ఈనెల 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. వారు మాట్లాడుతూ ఈ కౌన్సిల్ సమావేశంలో అజెండాలోని 44 అంశాలపై కౌన్సిలర్ ద్వారా చర్చించి తీర్మానం చేయడం జరుగుతుందన్నారు. తదుపరి పట్టణంలోని 40 వార్డులలో గల సమస్యలపై కూడా చర్చించడం జరుగుతుందని తెలిపారు. కావున కౌన్సిలర్లు సకాలంలో హాజరుకావాలని వారు కోరారు. (Story : ఈనెల 30 న కౌన్సిల్ సమావేశం)