Home వార్తలు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ ఫిలిం ‘శారీ’ డిసెంబర్ 20న విడుదల

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ ఫిలిం ‘శారీ’ డిసెంబర్ 20న విడుదల

0

రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ ఫిలిం ‘శారీ’ డిసెంబర్ 20న విడుదల

న్యూస్ తెలుగు / హైదరాబాద్ సినిమా : డిఫరెంట్ కంటెంట్‌లతో, నిజజీవిత సంఘటనల ఆధారంగా కొత్త వారితో ప్రయోగాలు చేయడంలో ముందుండే  రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ థ్రిల్లర్ మూవీ  ‘శారీ’. ఆర్జీవీ డెన్ ద్వారా వెలుగు చూస్తున్న’టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ’ అనే లాగ్ లైన్ తో పలు నిజజీవిత సంఘటనల మేళవింపుతో ఓ సైకలాజికల్ థ్రిల్లర్ గా రూపొందింది.  ఈ చిత్రం గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో RGV – AARVI ప్రొడక్షన్స్ బ్యానర్లో ప్రముఖ బిజినెస్ మాన్ రవి వర్మ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇందులో భయానక ప్రేమికుడిగా సత్య యాదు నటిస్తూండగా, అతనిలో సెగలు రేపే చీరలోని అమ్మాయి పాత్రలో ఆరాధ్య దేవి నటిస్తోంది. కాగా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ, తమిళ్ మరియు మలయాళ భాషల్లో డిసెంబర్ 20న విడుదల కానుంది. ‘శారీ’ చిత్రం ఆంధ్ర, తెలంగాణ రాష్టాలలో వెంకట సాయి ఫిలిమ్స్ ద్వారా తెలుగులో విడుదల చేయడానికి ప్రముఖ పంపిణీ దారుడు ముత్యాల రాందాస్ మంచి ఫాన్సీ రేట్ తో థియేట్రికల్ హక్కులు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే!

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ – ” ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా భయానకమైన రిలేషన్స్ కి తెరలు లేపుతుంది.   సోషల్ మీడియా అనేది జనానికి మేలు చేయకపోగా ‘యాంటీ సోషల్ మీడియా’గా మారుతోంది. ‘ఇన్ స్టాగ్రామ్’ వంటి యాప్ ల ద్వారా చాలామందిలో విచ్చలవిడితనం పెరిగిపోతోంది. పడచు అమ్మాయిలు వాటిలోని నిజాలను గ్రహించలేక  ఆకర్షితులవుతున్నారు. మితిమీరిన ప్రేమ ఎంత భయంకరంగా మారొచ్చు అనేది ఈ చిత్రంలోని ప్రధాన అంశం. వయసులో ఉన్న అమ్మాయిలకు కనువిప్పు కలిగేలా ఈ సినిమా తెరకెక్కింది.”అన్నారు.

నిర్మాత రవి వర్మ మాట్లాడుతూ – “ఇటీవల ఆర్టిఫిసియల్ ఇంటెలిజెన్స్ ప్రక్రియతో రికార్డు చేసిన “ఐ వాంట్ లవ్”  అనే తెలుగు, తమిళ్, హిందీ, మరియు మలయాళ  లిరికల్, ఫుల్ వీడియో సాంగ్  ‘ఆర్జీవీ డెన్ మ్యూజిక్’ ద్వారా విడుదల చేసాము, మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో మరో లిరికల్ సాంగ్ విడుదల చేస్తాము. డిసెంబర్ 20న ప్రపంచ వ్యాప్తంగా నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం.” అన్నారు. (Story : రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ ఫిలిం ‘శారీ’ డిసెంబర్ 20న విడుదల)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version