పేద ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యం
న్యూస్ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : పేద ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యము అని శ్రీ చౌడేశ్వరి ఆలయ అభివృద్ధి సంఘం అధ్యక్షులు బంధనాదం రమణ, కార్యదర్శి సిరివెళ్ల రాధాకృష్ణ, క్యాంపు చైర్మన్ డివి. వెంకటేశులు (చిట్టి) పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని తొగట వీధిలో గల శ్రీ శాంత గల చౌడేశ్వరి దేవి ఆలయ ఆవరణ ముందు 104 వా ఉచిత వైద్య చికిత్స శిబిరమును నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ శిబిరంలో పేద ప్రజలకు ఉచిత వైద్య చికిత్సలతో పాటు నెలకు సరిపడు మందులను కూడా పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వృద్ధులకు ప్రత్యేకంగా వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. ఈ శిబిరానికి దాతలుగా కీర్తిశేషులు గూండా నారాయణ స్వామి జ్ఞాపకార్థం వారి ధర్మపత్ని గూండా నాగలక్ష్మి, కుమారుడు గుండా నాగరాజు,( సిద్ది రాజేష్) అరుణ లు వ్యవహరించడం పట్ల ప్రత్యేకంగా కృతజ్ఞతలను తెలియజేశారు. వైద్య బృందంలో డాక్టర్ జైదీప్ నేత-హైదరాబాద్, డాక్టర్ వివేక్ కుల్లయప్ప, డాక్టర్ విట్టల్, డాక్టర్ సతీష్, డాక్టర్ చందన్ రెడ్డి, డాక్టర్ వినయ్ లు రోగులకు వైద్య చికిత్సలతో పాటు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తలు కూడా వివరించడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరంలో 296 మందికి ఉచిత వైద్యం తో పాటు మందులను కూడా పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ప్రతినెలా 150 మందికి ఒక్కొక్కరికి 200 రూపాయలు చొప్పున వృద్ధులకు గత కొన్ని సంవత్సరాలుగా పెన్షన్ కూడా పంపిణీ చేస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతినెల దాతల సహాయ సహకారములతోనే ఈ ఉచిత వైద్య శిబిరమును నిర్వహించుట మాకెంతో తృప్తిని ఇస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు బండి నాగరాజు, పెద్దకోట్ల విజయ్, పెద్ద కోట్ల భాస్కర్, బండి ఆంజనేయులు, బంధనాదం చిన్నికృష్ణ, కాచర్ల నారాయణస్వామి, రామచంద్ర, యంగముని, దాసరి దేవా, పవన్, పని, సాయి, సుశీలమ్మ తదితరులు పాల్గొన్నారు.(Story:పేద ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వడమే మా లక్ష్యం)