తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు అవకాశం లభించడం అదృష్టం
న్యూ తెలుగు/ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : తిరుపతి తిరుమల దేవస్థానం వారు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు నవంబర్ నెలలో ఉమ్మడి అనంతపురం జిల్లా వారికి హరినామ సంకీర్తనకు ఆహ్వానం రావడం ఎంతో సంతోషదాయకమని టీటీడీ సేవాకర్త నక్కల వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుట్టపర్తి జిల్లా అనంతపురం జిల్లా కు ఒకటవ తేదీ నుంచి 29వ తేదీ వరకు తేదీన వారిగా ధర్మవరం మండలంలోని నిమ్మలకుంట, పెనుగొండ మండలంలో గోని పెంట, ఒడిసి మండలం, కనగానపల్లి మండలం, ధర్మవరం పట్టణంలోని సాలే వీధి, సోమందేపల్లి, కొత్తచెరువు మండలం తిరుమల దేవరపల్లి, కొండకమర్ల, యాడికి మండలం ఓబులాపురం, రుద్దం మండలం సానేపల్లి భజన బృందముకు ఆహ్వానాలు రావడం జరిగిందని తెలిపారు. వీరందరికీ సెల్ ఫోన్ల ద్వారా సమాచారాన్ని అందించడం జరిగిందని తెలిపారు. ఒక్కరోజు ముందుగా తిరుమలకు చేరుకొని అక్కడ తమ భజన బృందాల వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు.(Story:తిరుమలలో అఖండ హరినామ సంకీర్తనకు అవకాశం లభించడం అదృష్టం)