కార్డెన్ సర్చ్ నిర్వహించిన రూరల్ పోలీసులు
న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ప్రభాకర్, రూరల్ ఎస్సై శ్రీనివాసులు, సిబ్బందితో కలిసి మండల పరిధిలోని ఓబుల నాయన పల్లి, ఓబుల నాయని పల్లి తండాలలో కార్డెన్ సెర్చ్ ను నిర్వహించారు. ఈ సందర్భంగా సారా అమ్మే వాళ్ళ ఇంటింటిని పరిశీలించి ఊరి బయట గల కంప చెట్లలో గల సుమారు 50 లీటర్ల ఊటను ధ్వంసం చేశారు. అనంతరం గ్రామంలో గ్రామ సభ ఏర్పాటు చేసి చట్టాలపై అవగాహన కల్పించారు. గొడవలకు దూరంగా ఉండాలని మధ్యానికి బానిస కాకూడదని ఎవరైనా నాటు సారా తయారు చేసిన లేదా అమ్మిన మాకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేరుని గోప్యంగా ఉంచుతామని తెలిపారు. (Story : కార్డెన్ సర్చ్ నిర్వహించిన రూరల్ పోలీసులు)