UA-35385725-1 UA-35385725-1

అన్నదాతలకు అధైర్యం వద్దు

అన్నదాతలకు అధైర్యం వద్దు

న్యూస్ తెలుగు/వనపర్తి : పదేళ్ల బీఆర్ఎస్‌ పాలనలో రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్‌ నాయకులు కొందరు నేడు రైతుల పక్షాన మొసలి కన్నీరు కారుస్తూ నిరసనలు చేపట్టడం ఆస్యాస్పదమని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం వనపర్తి పట్టణంలోని నంది హిల్స్ లో గల క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు జిల్లాల అభివృద్ధి ప్రాతిపతగిన అన్ని జిల్లాలలోనూ అభివృద్ధి జరిగిందని అదేవిధంగా వనపర్తి జిల్లాలోనూ ప్రభుత్వ కార్యాలయాలు కళాశాలలో నెలకొల్పబడ్డాయని అంతమాత్రాన అభివృద్ధి మేమే చేశాం అనడం నిద్దురమని ఎమ్మెల్యే విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిర్మింపబడిన రిజర్వాయర్లు ప్రధాన కాలువలకు చిన్నచిన్న బొక్కలు పెట్టి తామే అభివృద్ధి చేశామనడం గమనార్హం అన్నారు. పాలమూరు ఎత్తిపోతల నుంచి వనపర్తి నియోజకవర్గానికి ఒక్క ఎకరానికైనా నీరు అందుతుందా అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పెబ్బేరు సంతస్థలంలో మీరు అవకాతవకలు చేయకుంటే అదే వేణుగోపాల స్వామి ఆలయంలోకి తడిబట్టలతో రావాలని అందుకు నేను సిద్ధమని ఎమ్మెల్యే సవాలు విసిరారు. వనపర్తి బస్టాండ్ సమీపంలోని రాజా గారి స్థలంలోనూ కూడా ఎలాంటి అవినీతికి పాల్పడకుంటే వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి రావాలని ఆయన మరో మారు సవాల్ చేశారు. మీరు చేసిన అభివృద్ధి మాటున అవినీతిపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు సిద్ధంగా ఉన్నానని ఆయన సూటిగా విసిరారు. కృష్ణానది కబ్జపై జోగులాంబ ఆలయానికి వస్తానని ధైర్యముంటే అమ్మవారి ఆలయంలో చర్చకు రావాలన్నారు. వ్యవసాయ శాఖ మంత్రి హోదాలో వనపర్తికి నియోజకవర్గంలో వ్యవసాయ అభివృద్ధి కోసం మీరు ఒరగబెట్టింది ఏంటో చెప్పాలి అన్నారు. ప్రభుత్వ రాయితీలు పొందేందుకు పనివాళ్లను కూడా వదిలిపెట్టని నైజం మీదని ఘాటుగా విమర్శించారు భూ కబ్జాదారుడికి రుణమాఫీ బీఆర్ఎస్‌ నాయకులకి రైతు శ్రేయస్సు గురించి మాట్లాడి నైతిక హక్కు లేదని ఎమ్మెల్యే విమర్శించారు. పదేళ్ల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేని ప్రభుత్వం బీఆర్ఎస్‌ అని ఆయన అన్నారు. జర్నలిస్టుల ఇండ్ల పట్టాల విషయంలో పూర్తిస్థాయిలో జర్నలిస్టులను మోసం చేసిన పచ్చి మోకారి నీవు అని ఎమ్మెల్యే ఘాటుగా విమర్శించారు. జర్నలిస్టు మిత్రులు ఎవరు అధైర్యపడ్డ వద్దని అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించి పత్రిక నగర్ పేరా ప్రతి ఒక్క జర్నలిస్టుకు పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత తను తీసుకుంటానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇదే తరహాలో కుల సంఘాలకు సైతం భవన నిర్మాణాలు చేపడతామంటూ ప్రగల్ బాలు పలికారి తప్ప పైసా నిధులు కూడా ఇవ్వలేదని ఆయన తీవ్రంగా విమర్శించారు అన్ని మార్కెట్ యార్డులపై అప్పులు తీసుకువచ్చి మార్కెట్ యార్డులను అభివృద్ధి చేశారని చెప్పడం సిగ్గుచేటని ఎమ్మెల్యే విమర్శించారు. రోడ్ల విస్తరణలో ఇష్టానుసారంగా వ్యవహరించి నిధులు లేకుండానే నిర్మాణాలు చేపట్టామని నిస్సిగ్గుగా మాట్లాడడం హాస్యాస్పదమన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే 18 వేల ఒక వంద మంది రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వాన్నిదని ఎమ్మెల్యే పేర్కొన్నారు. త్వరలోనే రైతు భరోసా సైతం రైతుల అకౌంట్లో జమవుతుందని ఎవరు ఎలాంటి ఇబ్బందులకు గురికాకూడదని ఎమ్మెల్యే అన్నదాతలకు భరోసా కల్పించారు. ఈ పత్రిక సమావేశంలో ఎమ్మెల్యే తో పాటు మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు మార్కెట్ యార్డ్ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.(Story:అన్నదాతలకు అధైర్యం వద్దు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Weather

5,647SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles

error: Content is protected !!
వ‌ర్ధ‌మాన న‌టి మాళ‌విక స్టిల్స్‌! ర‌ష్మిక కొత్త పోజులు చూడాల్సిందే! మౌనీ రాయ్ లేటెస్ట్ హాట్ పిక్స్‌ కావ్య లేటెస్ట్ హాట్ పిక్స్‌! Actress BhagyaShri Borse Stills
UA-35385725-1