Homeవార్తలుఆంధ్రప్రదేశ్‌నేడే శతవసంత కార్యక్రమం

నేడే శతవసంత కార్యక్రమం

నేడే శతవసంత కార్యక్రమం

కండ సేవ ప్రముక్. ఓబుల దాస్.

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్యసాయి జిల్లా) : రాష్ట్రీయ స్వయంసేవక సంఘం 99 సంవత్సరాలుగా అన్ని ప్రాంతాలు నగరాలు జిల్లాలు, ఖండాలు, మండలాలు విస్తరించి గ్రామాలకు చేరుకునే దిశగా అందరినీ కలుపుకొని వేగవంతంగా జన్మ శతాబ్దిలో అడుగుపెడుతున్న సందర్భంగా ఆదివారం పట్టణములోని పురవీధులలో పద సంచలన్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఖండ సేవా ప్రముక్ ఓబుదాస్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఏర్పడి నూరు సంవత్సరాలు అయిన సందర్భంగా పత సంచలం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. హిందూ బంధువులందరూ క్రమశిక్షణతో సంఘటితంగా గణేష్ ధరించి రావాలని తెలిపారు. ఆత్మీయ సమ్మేళనం మధ్యాహ్నం 2 15 కు, మధ్యాహ్నం 3;45 నుండి పత సంచలనం ప్రారంభమవుతుందని తెలిపారు. కళాజ్యోతి, ఆర్టీసీ బస్టాండ్, పీఆర్టీ, గాంధీ సర్కిల్, తెరు బజార్, అర్జుమన్ సర్కిల్ మీదుగా కళాజ్యోతి చేరుకుంటుందని తెలిపారు. సార్వ జ నికోత్సవం సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు కళాజ్యోతిలో ఉంటుందని తెలిపారు. ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఆర్మీ హానరబుల్ లెఫ్ట్ ఫ్రంట్ శ్రీధర్, ప్రధాన వక్తగా కొండపల్లి రామారావు- ప్రాంత భౌతిక ప్రముఖు విశాఖపట్నం వారు హాజరవుతున్నట్లు తెలిపారు. కావున అందరూ ఈ శత వసంత కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు. (Story : నేడే శతవసంత కార్యక్రమం)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments

error: Content is protected !!