వైద్య మిత్రాలు నిరసన
న్యూస్‌తెలుగు/వినుకొండ : డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో పనిచేస్తున్న వైద్య మిత్రాలు రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు శనివారం నల్ల బ్యాడ్జీలతో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నందు తమ నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మాచర్ల బుజ్జి, కాకాని అప్పారావు మాట్లాడుతూ. దశలవారీగా ఉద్యమాన్ని ఉదృతం చేస్తూ ముందుకు వెళ్తున్నామని, ప్రభుత్వం స్పందించి పథకంలో 18 సంవత్సరాల నుండి పనిచేస్తున్నామని చాలీసాలని జీతాలతో కుటుంబాన్ని పోషించుకుంటున్నామని, గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసిందని, ఇప్పుడు వచ్చిన మంచి ప్రభుత్వం మా డిమాండ్లను పరిష్కరిస్తుంది మేము ఆశా భావాన్ని వ్యక్తం చేస్తున్నావు ప్రభుత్వం మరియు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్పిన విధంగా ఇప్పుడున్న పథకమును హెల్త్ ఇన్సూరెన్స్ పథకంలోకి తీసుకెళ్తే నెలలో పనిచేస్తున్న వైద్యమిత్రాలు నష్టపోతారని వారికి సర్వీస్ ని బట్టి కాంట్రాక్టు విధానంలోకి మార్చాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, కేడర్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా 29వ తారీఖు నుండి నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చలిగుండే హనుమంతరావు, మహేశ్వరి, నాగలక్ష్మి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. (Story : వైద్య మిత్రాలు నిరసన)