ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి : జిల్లా కలెక్టర్
న్యూస్ తెలుగు /ములుగు జిల్లా బ్యూరో (వై. లకుమయ్య ) L
ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా, అంకితభావంతో, సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ దివాకర తెలిపారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మండల ప్రత్యేక అధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, ఎంపిఒలతొ జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు ఇంచార్జీ సంపత్ రావు, డి పి ఓ దేవ్ రాజ్ లతో కలసి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులుగా విధి నిర్వహణలో ఎన్నో మంచి పనులు చేసే అవకాశం ఉంటుందని, దీన్ని సద్వినియోగం చేసుకొని మనసుకు, సంతృప్తినిచ్చే విధంగా మనసు పెట్టి,పనిచేయాలన్నారు. జిల్లాలోని 31 వసతి గృహాల్లో అత్యవసర మైన 3 పనులను తక్షణమే నివేదిక సిద్ధం చేసి, సమర్పించాలనీ అధికారులను సూచించారు. 3 రోజులలో పనులు మంజూరు చేయడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వం వసతి గృహాల నిర్వహణలో భాగంగా, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, ప్రభుత్వ ఎంతో డబ్బును వెచ్చిస్తుందని అన్నారు. వసతి గృహాలు, గురుకుల పాఠశాల పరిసరాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలాన్నారు. మండల ప్రత్యేక అధికారులు మండల పర్యటనలో తప్పని సరిగా హాస్టల్స్, పాఠశాలలు తనిఖీ చేయాలని, పర్యటనలు వల్ల విద్యార్థులకు నాణ్యమైన భోజనంతో పాటు విద్యాప్రమాణాలు పెంపొందించేందుకు దోహదపడుతుందని అన్నారు.
గ్రామాల్లో నీటిని సకాలంలో, సక్రమంగా, ఎలాంటి ఇబ్బందులు లేకుండా సరఫరా చేయడం పై మండల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గ్రామాల్లో వాటర్ లికేజీలు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరా లో ఇబ్బందులు లేకుండా స్వచ్చమైన త్రాగు నీరు అందేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
అన్నీ కులాల సామజిక వర్గాలకు సంబందించిన ఆర్థిక పరమైన, సామజిక పరమైన మరియు రాజకీయ పరమైన సమస్యల గురించి మండల కేంద్రము లలో సమావేశాలు నిర్వహించాలని అన్నారు.ఈ సమావేశం లో మండల ప్రత్యెక అధికారులు, తహశీల్దార్లు, ఎంపి డి ఓ లు, ఎం పి ఓ లు, ఆర్ డబ్లుఎస్ డి ఈలు, ఏ ఈ లు, తదితరులు పాల్గొన్నారు. (Story : ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా పని చేయాలి : జిల్లా కలెక్టర్)