ప్రతి ఒక్కరూ తెలుగుదేశం సభ్యత్వం నమోదు చేసుకోవాలి
న్యూస్ తెలుగు/ సాలూరు : ప్రతి ఒక్క కార్యకర్త తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు చేసుకోవాలని తెలుగుదేశం పార్టీ పోలీట్ బ్యూరో సభ్యురాలు మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. శనివారం ఆమె పార్టీ కార్యకర్తలతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు ఆమె
లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ
నేను టిడిపి కార్యకర్త అని సగర్వంగా చెప్తున్నానని ఆమె అన్నారు ఈరోజు
సభ్యత్వ నమోదు కార్యక్రమంలో కార్యకర్తలు అందరూ భాగస్వాములు కావాలి అన్నారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ్యత్వం తీసుకున్న అనంతరం అందరం కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం చేయాలని తెలిపారు. మన సాలూరు నియోజకవర్గంలో కూడా నెలరోజుల పాటు జరిగే కార్యక్రమంలో క్లస్టర్, యూనిట్, బూత్ ఇన్చార్జి ,సాధికార సారథులు అందరూ పాల్గొని విజయవంతంగా 50 వేలు సభ్యత్వాలు నమోదు లక్ష్యంగా పూర్తి చేయాలని తెలిపారు. ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి 2 లక్షలు నుండి 5 లక్షలు ప్రమాద భీమా పెంచటం జరిగిందని అన్నారు. చంద్రబాబు నాయుడు సభ్యత్వం నమోదు తీసుకున్న వెంటనే సంధ్యారాణి లక్ష రూపాయల శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్త అని గుండెల మీద చెయ్యి వేసుకొని ధైర్యంగా చెప్పగలిగినటువంటి ఏకైక నీతి, నిజాయితీ గల పార్టీ మన తెలుగుదేశం పార్టీ అని అన్నారు. కావున అందరూ మీమీ గ్రామాల్లో, వార్డుల్లో ప్రతీ ఒక్కరూ కూడా 100రూ చెల్లించి సభ్యత్వం నమోదు చేసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్పి బంజ్ దేవ్. తెలుగుదేశం పట్టణ అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు మండల అధ్యక్షులు పరమేశు తెలుగుదేశం పార్టీ నాయకులు తిరుపతరావు యుగంధర్. హర్స టిడిపి సర్పంచులు ఎంపీటీసీలు కార్యకర్తలు పాల్గొన్నారు. (Story : ప్రతి ఒక్కరూ తెలుగుదేశం సభ్యత్వం నమోదు చేసుకోవాలి)