రైతు కేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం
న్యూస్‌తెలుగు/వినుకొండ : వినుకొండ సబ్ డివిజను రైతుసేవా కేంద్ర సిబ్బంది నైపుణ్య పెంపుదలపై శిక్షణా కార్యక్రమం జిల్లా వనరుల కేంద్రం, నరసరావుపేట వారిచే వినుకొండ సిబ్బంది ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించారి..శిక్షణా కార్యక్రమం లో జిల్లా శిక్షణా కోఆర్డినేటర్ ఎం. శివ కుమారి వరి లో చీడపీడల యాజమాన్యం గురించి వివరిస్తూ మన ప్రాంతంలో ఆకుముడత, దోమపోటు ఆశించే అవకాశం వుంది కనుక, ఆర్థిక నష్ట పరిమితి స్థాయి ని బట్టి దోమ నివారణకు డైనోటేఫ్యు రాన్ లేదా బూప్రొఫెజీన్ లేదా ట్రై ఫ్లూమెజోపైరిన్ వాడాలని, ఆకుముడత నివారణకు కార్టాప్ హైడ్రో క్లోరైడ్ వాడాలని, రబి మొక్కజొన్న లో సమగ్ర పోషక యాజమాన్యం లో భాగంగా జీవన ఎరువులు, 100 కిలోల నత్రజని, 35 కిలోల భాస్వరం, 35 కిలోల పొటాష్ వాడాలని తెలిపారు. మరియు వివిధ పంటలలో వాడవలసిన జీవన ఎరువుల గురించి తెలిపారు. ఉద్యాన శాఖాధికారి రసూల్ మిరప లో యాజమాన్య పద్ధతులు ఉద్యాన శాఖ లో అమలవుతున్న పథకాల గురించి వివరించారు. వినుకొండ, ఈపూరు, బొల్లాపల్లి, నూజెండ్ల్ మండలవ్యవసాయ శాఖాధికారులు పంటల బీమా, వ్యవసాయ శాఖలో ఇతర పథకాల గురించి వివరించారు. శిక్షణా కార్యక్రమంలో వ్యవసాయ అధికారులు, రైతు సేవా కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు. (Story : రైతు కేంద్ర సిబ్బందికి శిక్షణ కార్యక్రమం)