Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కలకలం సృష్టించిన బత్తలపల్లి కాల్పుల కేసు చేదించిన పోలీసులు

కలకలం సృష్టించిన బత్తలపల్లి కాల్పుల కేసు చేదించిన పోలీసులు

0

కలకలం సృష్టించిన బత్తలపల్లి కాల్పుల కేసు చేదించిన పోలీసులు

10, మంది ముఠా సభ్యులు అరెస్ట్..
ముఠా సభ్యుల నుండి..2వాహనాలు,2నకిలీ తుపాకులు, 19 నకిలీ బుల్లెట్లు,
సుమారు రెండు కేజీల నకిలీ బంగారంతో పాటు పూసల చైన్ వాకీ..టాకీ
మైకు స్వాధీనం చేసుకున్న వైనం. జిల్లా ఎస్పీ రత్న

న్యూస్ తెలుగు/ ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : ఈనెల 20వ తేదీన ధర్మవరం నియోజకవర్గం బత్తలపల్లి కాల్పుల కలకలం మోగింది. ఈ కేసు బత్తలపల్లి పోలీసులు ఐదు రోజుల్లోనే చేదించారు. ఈ సందర్భంగా శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న ధర్మవరం పట్టణంలోని డిఎస్పీ కార్యాలయంలో విలేకరులతో ఈ కేసు కు సంబంధించిన విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ నకిలీ బంగారం వ్యాపార విషయంలో అనంతపురం కదిరి జాతీయ రహదారి బత్తలపల్లి మండలం రామాపురం కూడలిలో ఆదివారం ఉదయం రెండు ముఠా సభ్యుల మధ్య జరిగిన కాల్పుల వ్యవహారం కేసులో రెండు ముటాలకు చెందిన పదిమంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వారు తెలిపారు.
అనంతపురం- కదిరి జాతీయ రహదారిపై బత్తలపల్లి మండలం రామాపురం కూడలిలో రెండు ముటాల మధ్య కాల్పులు జరిగాయి అని,
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొని కేసు విచారణ వేగవంతం చేయాలని డీఎస్పీను ఆదేశించడం జరిగింది అన్నారు. ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు నేతృత్వంలో సిఐలు ప్రభాకర్, నాగేంద్రప్రసాద్, రెడ్డప్ప బత్తలపల్లి ఎస్ఐలు నాలుగు పోలీసు బృందాలను గా ఏర్పడి ఈ ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
ఈ సంఘటనలో హైదరాబాద్ కు చెందిన 8, మంది ముఠా సభ్యులు, షికారి పాలెం గ్రూపుకు చెందిన మరో ఇద్దరు ముఠా సభ్యులను అరెస్టు చేశామన్నారు.ముద్దాయిలు వివరాలు తెలుపుతూ
పులి అరవింద్ కుమార్, స్వగ్రామం నార్మెట్ట గ్రామం, జనగాం జిల్లా, తెలంగాణ స్టేట్, ప్రస్తుతం పాపిరెడ్డి నగర్, జగద్గిరీగుట్ట, హైదరాబాద్, తెలంగాణ స్టేట్ ఉంటున్నారని,
గుల్ల నాగరాజు, వయస్సు పాపిరెడ్డి నగర్, జగద్గిరీగుట్ట, హైదరాబాద్, తెలంగాణ స్టేట్,కీసరి నరేశ్, మంసానిపల్లి గ్రామం, జనగాం జిల్లా, తెలంగాణ స్టేట్,
జాన్వేష్, ఐజా మండలం, గద్వాల్ జిల్లా, తెలంగాణ స్టేట్,నవాబ్ పేట సాయి రితీష్ రెడ్డి, మల్కాపూర్ గ్రామం, చేవెళ్ళ మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ స్టేట్ ,సంతక సతీష్,బిక్కవోలు గ్రామం, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్,
షైక్ షంషేర్ ఖాన్, కంకర కుంట, నగరపాళ్యం రోడ్, గుంటూరు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్,అజోజీ అరవింద్ కుమార్, జె.పి. కాలనీ, నిజామాబాద్ జిల్లా, తెలంగాణ స్టేట్.
పోమర్ బంగారి, షికారి పాల్యం, వీరబల్లి మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్,
రాణా హరీష, షికారి పాల్యం, వీరబల్లి మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ అని తెలిపారు.పరారీలో ఉన్న నిందితు లను కూడా అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు. వారిలోషికారి పాల్యం, వీరబల్లి మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్,
పోమరి విలాస్ షికారి పాల్యం, వీరబల్లి మండలం, అన్నమయ్య జిల్లా, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్,
అని తెలిపారు. తదుపరి కేసు పూర్వాపరాలు తెలుపుతూ షికారి పాలెం, వీరబల్లి మండలం, అన్నమయ్య జిల్లా కి చెందిన పొమారి బంగారి, రాణా హరిష, రాణా నూర్,పోమరి విలాస్ కలిసి అసలు బంగారం ముసుగులో నకిలీ బంగారాన్ని విక్రయించడం ద్వారా ప్రజలను మోసం చేసే నేరాలకు పాల్పడే అలవాటుగల నేరస్థులు అని తెలిపారు. వీరు తెలంగాణ జనగామ జిల్లా, మానసన్పల్లి గ్రామంలోని నరేశ్ ను సంప్రదించి, నకిలీ బంగారాన్ని రూ.15 లక్షలకు విక్రయించే ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు, శికారిపాల్యం ముఠా నకిలీ బంగారం అమ్మకం గురించి ముందుగానే తెలిసిన నరేష్, హైదరాబాదుకు చెందిన పులి అరవింద్ కుమార్ అనే వ్యక్తిని సంప్రదించి, పైన పేర్కొన్న ముఠా యొక్క పద్ధతుల గురించి సమాచారం ఇవ్వడం జరిగిందన్నారు. సైబర్ క్రైమ్ లో ఎథికల్ హ్యాకర్ అయిన అరవింద్, తన సహాయకులతో కలిసి రైడ్ ను ప్లాన్ ద్వారా ఇలా నకిలీ బంగారం విక్రయించే ముఠాల గురించి ప్రజలలో అవగాహన కల్పించడానికి తన “ఎ.కె. సైబర్ న్యూస్ యూట్యూబ్” ఛానెల్లో అప్లోడ్ చేయడానికి జరిగే సంఘటనలను రికార్డ్ చేయాలని ప్లాన్ చేయడం జరిగిందని, ఈ మేరకు ఈనెల 20వ తేదీన నిర్ణీత సమయం ప్రకారం సుమారు 09.00 గంటలకు శికారిపాలెం ముఠా, పులి అరవింద్ బృందం రామపురం గ్రామం, బతలపల్లి పీఎస్ సమీపంలో సమావేశం కావడం జరిగింది అన్నారు.ఈ సమావేశంలో ఘర్షణ జరగడంతో పులి అర్వవింద్ యొక్క సహాయకులు వారు తీసుకువెళ్ళిన డమ్మీ పిస్టళ్లతో కాల్పులు జరపగా రెండు గ్రూపులు అక్కడి నుండి పారిపోవడం జరిగింది అన్నారు.ఈ ఘటనకు ఉపయోగించిన బొమ్మ తుపాకులను నితీష్ రెడ్డి, జాన్వేష్ హైదరాబాద్ లోని కోటి నుండి ఒక్కొక్కటి రూ.400కి కొనుగోలు చేశారు అని,ఈ తుపాకులు నిజమైనవిగా కనిపించినప్పటికీ, ధ్వని ప్రభావాలను మాత్రమే ఉత్పత్తి చేశాయి అని, ప్రాణాంతకమైన సామర్థ్యాన్ని కలిగి లేవు అని స్పష్టం చేశారు. ఘర్షణ సమయంలో బాధితులను బెదిరించడానికి వాటిని ఉపయోగించడం జరిగిందన్నారు.
ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకొన్న శ్రీ సత్య సాయి జిల్లా ఎస్‌.పి. ధర్మవరం డి.‌ఎస్‌.పి. పర్యవేక్షణలో నాలుగు బృందాలను ఏర్పాటు చేసి, హైదరాబాద్ కు చెందిన 8 మంది ముద్దాయిలను బతలపల్లి మండలం వేల్పుమడుగు క్రాస్ వద్ద శుక్రవారం ఉదయం 06.00 గంటల సమయం లో అరెస్టు చేయడమైనది అని తెలిపారు. అంతేకాకుండా షికారి పాల్యం గ్రూపుకు చెందిన ముద్దాయి హరీష ను కూడా అరెస్టు చేయడమైనది అని తెలిపారు.ఈ కేసులో షికారి పాల్యం గ్రూపుకు చెందిన ముద్దాయిలు రాణా బాబు రావు, పోమరి విలాస్ఇలాచి లను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. ఈ కేసుకు సంబంధించిన
రెండు కార్లు,
రెండు నకిలీ తుపాకులు, 19 నకిలీ ప్లాస్టిక్ బుల్లెట్లు,
సుమారు రెండు KG లు గల నకిలీ బంగారు పూసల ఛైను,
ఒక వాకి-టాకీ ,
ఒక మైకు లను స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. తదుపరి ఎస్పీ రతరత్న పోలీస్ అధికారులను అభినందించారు.
ఈ కేసును నాలుగు రోజుల్లో చేదించిన ధర్మవరం సబ్ డివిజన్ పోలీస్ అధికారులను, ఎస్ ఓ జి టీమ్ సభ్యులను జిల్లా ఎస్పీ అభినందించడంతోపాటు రివార్డ్స్ ను ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో ఎస్పీ తో పాటు, ధర్మవరం డిఎస్పి శ్రీనివాసులు, సి ఐ లు నాగేంద్రప్రసాద్ ప్రభాకర్, రెడ్డప్ప, ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. (Story : కలకలం సృష్టించిన బత్తలపల్లి కాల్పుల కేసు చేదించిన పోలీసులు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version