Home వార్తలు తెలంగాణ జిల్లాలో 21వ పశు గణన సర్వేను పకడ్బందిగా నిర్వహించాలి

జిల్లాలో 21వ పశు గణన సర్వేను పకడ్బందిగా నిర్వహించాలి

0

జిల్లాలో 21వ పశు గణన సర్వేను పకడ్బందిగా నిర్వహించాలి

న్యూస్‌తెలుగు/వనపర్తి : జిల్లాలో 21వ పశు గణన సర్వేను పకడ్బందిగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాలులో జిల్లా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో 21వ పశు గణన సర్వేకు సంబంధించిన గోడ పత్రికను జిల్లా అధికారులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని అన్ని రకాల పశువులను మొబాయిల్ యాప్ ద్వారా గణించాల్సి ఉంటుంది. ఈ బృహత్తర కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటికి వచ్చే సిబ్బందికి పశువుల సమగ్ర సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెలు, కోళ్లు, కుక్కలు మొదలైన పశువుల లెక్కలు తేలాల్సి ఉంటుంది.
అదనపు కలెక్టర్ రెవెన్యూ నగేష్, డిఆర్డిఓ పీడీ ఉమాదేవి, పశు సంవర్ధక శాఖ అధికారి వెంకటేశ్వర్లు, డి.పి.ఆర్. ఒ సీతారాం, తదితరులు పాల్గొన్నారు. (Story : జిల్లాలో 21వ పశు గణన సర్వేను పకడ్బందిగా నిర్వహించాలి)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version