Home వార్తలు ఆంధ్రప్రదేశ్‌ కళాకారుల దినోత్సవం అనేది ప్రతి ఒక్క కళాకారులు వేడుకగా జరుపుకుంటారు

కళాకారుల దినోత్సవం అనేది ప్రతి ఒక్క కళాకారులు వేడుకగా జరుపుకుంటారు

0

కళాకారుల దినోత్సవం అనేది ప్రతి ఒక్క కళాకారులు వేడుకగా జరుపుకుంటారు

మానస నృత్య కళాకేంద్రం గురువు ఆర్. మానస

న్యూస్ తెలుగు /ధర్మవరం (శ్రీ సత్య సాయి జిల్లా) : కళాకారుల దినోత్సవం అనేది ప్రతి ఒక్క కళాకారులు వేడుకగా సంతోషంగా జరుపుకుంటారని మానస నృత్య కళా కేంద్రం (కూచిపూడి నాట్య గురువు) ఆర్. మానస తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ కళాకారుల దినోత్సవం పురస్కరించుకొని పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కళాకారులు కళ ని కేవలం ఒక ఇంటికి మాత్రమే పరిమితం కానివ్వకుండా, ప్రపంచం మొత్తానికి తెలిసేలా తమకళలను ప్రదర్శిస్తారని తెలిపారు.”నృత్యం అనే కళ ద్వారా సమాజానికి మన ఇతిహాసాల గురించి వాటి గొప్పతనం గురించి తెలియజేయడం జరుగుతుందన్నారు.ఈరోజు కళాకారుల దినోత్సవం మాత్రమే కాకుండా …”ఎంతో గొప్ప చిత్ర కళాకారుడు అయినటువంటి గౌ.పికాసో గారి ” పుట్టిన రోజు కూడా మనం జరుపుకుంటున్నామని తెలిపారు.మన సంస్కృతి సాంప్రదాయాలు అన్ని కూడా ఈ కళల ద్వారా మనం నేర్చు కోవడం జరుగుతోందన్నారు. మన జాతి ఔన్నత్యాన్ని ఈ కళ నలుగురికీ తెలిసేలా చేస్తుంది… అని ఈ ప్రపంచానికి కళాకారులు అనేటువంటి వారు చాల ముఖ్యం అని అన్నారు. దేశ రాష్ట్రంలో ఉన్న స్థానికంగా ఉన్న
గొప్ప గొప్ప కళాకారులు అందరికీ కూడా అంతర్జాతీయ కళాకారుల దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. (Story : కళాకారుల దినోత్సవం అనేది ప్రతి ఒక్క కళాకారులు వేడుకగా జరుపుకుంటారు)

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version