దీగ్రస్ నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై నాయకులతో ఎమ్మెల్యే సమాలోచనలు
న్యూస్‌తెలుగు/వనపర్తి : మహారాష్ట్ర రాష్ట్రంలోని దీగ్రస్ నియోజకవర్గంలో జరగబోయే ఎమ్మెల్యే ఎన్నికల ప్రక్రియపై, అక్కటి రాజకీయ పరిస్థితులపై గురువారం వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమాలోచనలు చేశారు. నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా ఎంపికైన ఆయన గత రెండు రోజులుగా నియోజకవర్గ రాజకీయాలపై ఆరా తీస్తు పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి వచ్చిన ఆయనకు మాణిక్ రావు ఠాక్రే కుమారుడు రాహుల్ ఠాక్రె గారు శాలువాలతో సన్మానించి స్వాగతం పలికారు. అనంతరం ధార్వా నియోజకవర్గం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన స్థానిక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో యూత్ కాంగ్రెస్ అధ్యక్షులతో NSUI అధ్యక్షులతో సమావేశమయ్యారు. రానున్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు పూర్తిస్థాయిలో ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే వారికి సూచించారు. (Story : దీగ్రస్ నియోజకవర్గ రాజకీయ పరిణామాలపై నాయకులతో ఎమ్మెల్యే సమాలోచనలు)